కథలు చెప్పకుండా ఎంజాయ్ చేశారంతే

Fri Oct 20 2017 09:43:13 GMT+0530 (IST)

మామూలుగా దీపావళి అంటే చాలు.. చాలామంది స్టార్లు.. ముఖ్యంగా హీరోయిన్లు కథలు చెప్పేస్తున్నారు. ఒకప్పుడు సేఫ్ దీపావళి అనేవారు కాని.. ఇప్పుడు మాత్రం పొగ కాలుష్యం లేని దీపావళి చేసుకోండి.. లేదంటే మీరు కాల్చే బాణాసంచా  వలన మూగజీవాలకు ఇబ్బందిగా ఉంటుంది.. కాల్చకండి.. అంటూ హడావుడి చేస్తున్నారు. అయిత ఇందులో నిజం ఉన్నప్పటికీ.. రోజూ మన వాహనాలు చేసే శబ్ద మరియు పొగ కాలుష్యంతో చూసుకుంటే ఇదెంతా?సరిగ్గా ఇదే విషయం ఈ మధ్యన శద్రా కపూర్ వంటి హీరోయిన్ చెబితే.. నెటిజన్లు బూతులు తిట్టిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా తమ ఎంజాయ్ మెంట్ తమదే అన్నట్లు చక్కగా టపాసులు కాల్చుకుంటూ ఆనందంగా దీపావళిని జరుపుకున్నారంతే. అదిగో మన బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. అలాగే యాంకర్ అనసూయ చక్కగా కాకరపూవొత్తులను కాల్చుకుంటూ.. ఆ వీడియోలను తమ సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేశారు. సంవత్సరానికి ఒకసారి ఆనందంగా జరుపుకునే ఈ కాంతుల సంబరాన్ని మేమెందుకు కాదనుకుంటాం అన్నట్లుంది వారి వరుస.

ఇకపోతే టాలీవుడ్ లో చాలామంది హీరోలు నిన్న బాణాసంచాకంటే ఎక్కువగా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడానికి ఇష్టపడ్డారట. అది సంగతి.