శాతకర్ణిలో హాటీ అనసూయ కూడా

Tue Jan 10 2017 16:04:39 GMT+0530 (IST)

గౌతమిపుత్ర శాతకర్ణిలో హీరోయిన్ గా.. శాతకర్ణి భార్య వశిష్టీ దేవిగా శ్రియా శరణ్ నటించిన సంగతి తెలిసిందే. మరి ఈ మూవీలో హాట్ యాంకర్ అనసూయకు ప్లేస్ ఎలా.. ఇలాంటి చారిత్రక చిత్రంలో ఆమె పాత్ర ఏంటి అనే అనుమానాలు వస్తున్నాయా? బాలయ్య వందో మూవీలో అనసూయకు కూడా భాగం ఉందన్న మాట నూటికి నూరు పాళ్లు వాస్తవం.

కాకపోతే.. ఈ సినిమాలో ఆమె కనిపించదు. అనసూయ జస్ట్ తన వాయిస్ ను వినిపిస్తుందంతే. గౌతమిపుత్ర శాతకర్ణిలో.. ఇండో-గ్రీక్ యోధురాలు పాత్రను డచ్ మోడల్ ఫరా కరిమి నటించింది. ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పాల్సిందిగా.. క్రిష్ అడిగాడు. బాలయ్య వందో సినిమాలో తాను భాగం అయ్యే అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోవడం ఇష్టం లేని అనసూయ.. వెంటనే ఓకే చెప్పేసింది. మూవీలో ఈ పాత్ర 15 నిమిషాల పాటు ఉన్నా.. మూవీని టర్న్ చేసే రోల్ అంటోంది అనసూయ.

నిజానికి అనసూయకు డబ్బింగ్ చెప్పడం కొత్తేం కాదు. వేదం చిత్రంలో దీక్షాసేథ్ కు కూడా అనసూయే డబ్బింగ్ చెప్పిందట. అయితే.. యాంకరింగ్ కెరీర్ లో బిజీగా ఉండడంతో అటువైపు వెళ్లలేదట. కానీ ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి రూపంలో.. బాలయ్య సినిమా కోసం మళ్లీ క్రిష్ నుంచే అభ్యర్ధన వస్తే కాదనలేక పోయానని చెప్పింది అనసూయ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/