Begin typing your search above and press return to search.

అలా చెప్పుకుని సర్దుకుపోతోంది యాంకర్

By:  Tupaki Desk   |   17 Aug 2017 4:46 AM GMT
అలా చెప్పుకుని సర్దుకుపోతోంది యాంకర్
X
''సెక్సీ అంటే అది బాడీ టైప్ కాదు. ఒక యాటిట్యూడ్. మన స్టేట్ ఆఫ్ మైండ్'' అంటూ స్టేట్మెంట్లు ఇస్తూ వార్తల్లోకి ఎక్కుతోంది యాంకర్ అనసూయ. అయితే ఈ స్టేట్మంట్లన్నీ చూస్తుంటే మాత్రం.. అనసూయకు యాప్ట్ కాదేమో అనిపించడంలేదు? ఎందుకంటే సెక్సీ అనే స్టేట్ ఆఫ్‌ మైండ్ కూడా ప్రస్తుతం ఆమె దగ్గర లేదు కదా అంటున్నారు నెటిజన్లు.

అప్పట్లో వరుసగా ఐటెం సాంగ్ ఆఫర్లు వచ్చినప్పుడు.. నేను నటించి చూపిస్తాను అని చెప్పింది. తరువాత మాత్రం ఆ ఐటెం సాంగ్సే చేపట్టింది. కాని లాభం ఏముంది. అవి కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. అదే విధంగా అమ్మడు హాట్ లుక్స్ అనేవి పెద్దగా ఏం లేవు అనే విమర్శను కూడా ఎదుర్కొంటోంది. ఒకవేళ ఇండస్ర్టీలో ఏదన్నా ఫీట్ చేయాలంటే.. అలా హాటుగా ఉండాలే తప్పించి.. సెక్సీ అంటే బాడీ టైపు కాదు యాటిట్యూడ్ అని చెప్పుకోవడం అంటే.. మనకు హాట్ లుక్ లేదని.. దానిని కవర్ చేసుకుంటూ ఇచ్చుకున్న స్టేట్మెంటే కదా అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

నిజానికి సెక్సీ అనేది యాటిట్యూడ్ అని అనుకుంటే.. అది నూటికి 1 శాతం మాత్రం వర్కవుటు అవుతుంది. ఇప్పటికే ప్రపంచమంతా సెక్సీ అంటే సైజ్ జీరో అనే ఉద్దేశ్యంలో ఉన్నప్పుడు.. ఖచ్చితంగా సమంత అయినా రకుల్ అయినా జిమ్ లో ఆరు గంటలు గడపాల్సిందే.. గడుపుతున్నారు కూడాను. ఏమంటావ్ అనసూయ?