అనసూయ పాత్ర అది కాదు బాబోయ్

Thu Jan 18 2018 21:56:57 GMT+0530 (IST)

యాంకర్స్ ప్రపంచంలో ప్రస్తుతం పోటీ ఎంత ఉన్నా కూడా ఎవరి టాలెంట్ తో వారు కెరీర్ ను బాగానే నెట్టుకొస్తున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ యాంకర్ అనసూయ మాటలతోనే కాకుండా తన అందాలతో కూడా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైపోయింది. ముఖ్యంగా కుర్రకారు అనసూయ అందాలకు చాలా వరకు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా వరకు పెరిగిపోతోంది. ఇక సినిమాల్లోను ఈ భామ స్పెషల్ క్యారెక్టర్స్ తో రచ్చ చేస్తోన్న సంగతి తెలిసిందే.అయితే మొన్నటి వరకు ఈ బ్యూటీ చేసిన పాత్రలు ఒక లెక్క అలాగే నెక్స్ట్ రాబోతోన్న రంగస్థలం సినిమాలో చేసిన పాత్ర ఒక లెక్క అంటోంది. ఇటీవల ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చిట్ చాట్ బాగానే చేసింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా బాగానే చెప్పింది. తన వ్యక్తిగత విషయాల గురించే కాకుండా వృత్తి పరమైన విషయాలలో కూడా క్లారిటీ ఇచ్చింది. ఇకపోతే చాలా రోజులుగా అభిమానులు ఆమెను ఒక ప్రశ్న అడిగి తెగ విసిగిస్తున్నారు.

అదేమిటంటే.. రంగస్థలం సినిమాలో మీరు రామ్ చరణ్ కు అత్తగా కనిపించబోతున్నారు అని తెలిసింది. నిజమేనా? అని కొంత మంది నెటీజన్స్ అడిగిన ప్రశ్నకు..అయ్యో అది కాదు బాబోయ్ అనే విధంగా సమాధానం ఇచ్చింది. గతంలో కూడా అనసూయ రంగస్థలం సినిమాకు సంబంధించిన ఒక ఫోటోని పోస్ట్ చేసి సినిమాలో స్పెషల్ రోల్ అని చెప్పగా ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. అప్పుడు కూడా ఆమె వివరణ ఇచ్చింది. మరి సినిమాలో ఆ స్పెషల్ క్యారెక్టర్ ఏంటో తెలియాలంటే.. మార్చ్ ఎండింగ్ వరకు ఆగాల్సిందేనట.