Begin typing your search above and press return to search.

చూపిస్తానని చరణ్ కి ప్రామిస్ చేశా

By:  Tupaki Desk   |   16 Oct 2017 1:12 PM GMT
చూపిస్తానని చరణ్ కి ప్రామిస్ చేశా
X
రామ్ చరణ్ కెరీర్ లోనే ఎంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం రంగస్థలం 1985. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఛైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. చిత్ర యూనిట్ సినిమా కోసం చాలా కష్టపడుతోంది. సినిమాలో నటిస్తున్న ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా సెట్స్ లో వర్క్ చేస్తున్నారట. అయితే సినిమాలో నటిస్తోన్న యాంకర్ అనసూయ - చరణ్ గురించి ఒక విషయాన్ని తెలిపింది.

చరణ్‌ చాలా గొప్ప వ్యక్తిత్వం గలవాడని ఒక పని మొదలు పెడితే దాన్ని నేర్చుకోవడానికి చాలా ఇష్టపడతారని చెబుతూ.. ఒక చిన్నపిల్లాడిలా చాలా ఆసక్తిని చూపిస్తారని ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. అంతే కాకుండా షూటింగ్ లో ఉన్నప్పుడు చిత్ర దర్శకుడు సుకుమార్ అండ్ హీరో రామ్ చరణ్ తో కలిసినప్పుడు ఎక్కువగా వంటల గురించే మాట్లాడుకునే వారమని అనసూయా సమాధానాన్ని ఇచ్చింది.

''ఇక చరణ్‌ కి సుకుమార్ కి ఒక ప్రామిస్ చేశాను అంటూ.. వారికి కాకరకాయ స్పెషల్ గా తనే వండి తీసుకువస్తాను అని చెప్పాను. త్వరలో స్టార్ట్ కాబోయే నెక్స్ట్ షెడ్యూల్ లో తప్పకుండా వారికి వంట రుచిని చూపిస్తాను'' అని అనసూయ భరద్వాజ్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో అమ్మడు ఒక స్పెషల్ రోల్ లో కనిపింఛనుదట. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఒక ఐటెం సాంగ్ చేస్తోంది. పల్లెటూరి నేపథ్యంలో సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.