Begin typing your search above and press return to search.

ఆ ప్రశ్న అనసూయను అడగరే?

By:  Tupaki Desk   |   17 Feb 2017 11:18 AM GMT
ఆ ప్రశ్న అనసూయను అడగరే?
X
హాట్ యాంకర్ అనసూయ ఇప్పుడు విన్నర్ మూవీలో ఐటెం సాంగ్ తో.. ఆమె భాషలో అయితే స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అసలు ఇలాంటి స్పెషల్ సాంగ్ లో చేసేట్లయితే.. ఈ భామకు ఎప్పుడో అత్తారింటికి దారేది టైంలోనే ఛాన్స్ వచ్చేది. అలాంటివి కాకుండా.. స్పెషల్ రోల్స్ కోసం బాగానే వెయిట్ చేసింది ఈ భామ.

సోగ్గాడే చిన్ని నాయనలో అనసూయ చేసిన చిన్ని కేరక్టర్ ను పక్కన పెట్టినా.. క్షణం మూవీలో మాత్రం కీలకమైన పాత్రతో కుమ్మేసింది. ఆ మూవీతో బంపర్ హిట్ కొట్టింది కూడా. యాక్టింగ్ లో కూడా ట్యాలెంట్ చూపించింది. మళ్లీ ఆ తర్వాత మాత్రం ఇలాంటి ఛాన్స్ లు రాలేదు. క్షణం వచ్చి ఏడాది గడిచిపోయింది. అర్ధవంతమైన పాత్రలు చేస్తానని చాలాసార్లే చెప్పింది అనసూయ. అయినా సరే కేరక్టర్ రోల్స్ ఏవీ రాలేదు. అయితే.. ఇప్పుడు మీడియాలకు ఆమె ఇంటర్వ్యూలు ఇస్తున్నా.. వీళ్ల క్వశ్చన్స్ కూడా ఆ పాట చుట్టే ఉంటున్నాయి.

క్షణం తర్వాత మళ్లీ అలాంటి ఎందుకు రాలేదు? కేరక్టర్ ఆర్టిస్ట్ గా ఎందుకు చేయట్లేదు? ఎప్పుడో వద్దు అనుకున్న ఐటెం సాంగ్ నే ఎందుకు చేయాల్సి వచ్చింది? లాంటి ప్రశ్నలు ఆమెకు ఎదురు కావడం లేదు. దీంతో తనకు అలవాటైన పాత మాటలనే కొత్త పాట పాడేస్తోంది అనసూయ. ఇంతకీ క్షణం తర్వాత ఏడాది గడిచిపోయింది కదా.. ఈ టైంలో అనసూయకు కొత్త అవకాశాలను ఫిలిం మేకర్స్ ఇచ్చినట్లా.. ఇవ్వనట్టా అనే విషయంలో కూడా క్లారిటీ లేదు కదా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/