అనసూయ తగ్గట్లేదుగా!!

Thu May 17 2018 12:06:49 GMT+0530 (IST)

టాలీవుడ్ లో హీరోయిన్స్ క్రేజ్ పెరుగుతుండడం కామన్. అలాగే ఐటెమ్ సాంగ్స్ తో అలరించే భామలకు కూడా కూడా ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఏర్పడుతుంది. కానీ ఈ రెండింటికి మధ్య ఉండే ఓ నటీమణులకు కూడా క్రేజ్ బాగానే అందుతోంది. ఉదాహరణకు అనసూయ లాంటి జబర్దస్త్ యాంకర్స్ ఏ స్థాయిలో ఆదరణను అందుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సోగ్గాడే చిన్ని నయన సినిమాతో కొంచెం రొమాంటిక్ గా కనిపించిన ఈ బ్యూటీ క్షణం సినిమాతో నటిగా కూడా సక్సెస్ అయ్యింది. ఇక ఇటీవల వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మ గా అనసూయ కనిపించిన తీరుకి మంచి మార్కులే పడ్డాయ్. దీంతో వరుసగా ఆఫర్లు కూడా రావడం అమ్మడు బిజీ అవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న F2 సినిమాలో అనసూయ ఓ పల్లెటూరి అమ్మాయిలా కనిపించబోతోంది.

వెంకటేష్ - వరుణ్ హీరోలుగా నటిస్తోన్న ఆ మల్టీస్టారర్ కామెడీ చిత్రంలో అనసూయ పాత్ర అందరికి నచ్చుతుందట. అనిల్ ఆ పాత్రను ఆమె కోసం ప్రత్యేకంగా రెడీ చేశాడట. అలాగే మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో కూడా ఈ హాట్ యాంకర్ అవకాశం అందుకుంది. రీసెంట్ గా వెంకటలక్ష్మి అనే సినిమాను ఒకే చేసినట్లు తెలుస్తోంది. అలాగే సచ్చింది గొర్రె అనే సినిమా ద్వారా ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ డార్క్ కామెడీ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది.