బాగా ఆశలు పెట్టేసుకున్నావ్ అనసూయా

Mon Mar 19 2018 09:19:44 GMT+0530 (IST)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లేటెస్ట్ సినిమా రంగస్థలంలో హీరో హీరోయిన్ల క్యారెక్టర్ల తరవాత అంతటి ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది రంగమ్మత్త పాత్రే. హాట్ యాంకర్ అనసూయ ఈ పాత్ర చేసింది. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్.. ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న అనసూయ ఈ పాత్ర ఎందుకు చేసింది.. ఆ పాత్రలో అంత స్పెషాలిటీ ఏమిటన్న దానిపై అందరిలోనూ ఆసక్తి ఉంది.రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్లో దీనికి సంబంధించి అనసూయ కొంతవరకు ఆన్సరిచ్చింది. ఈ క్యారెక్టర్ గురించి తనకు చెప్పగానే ముందు చెయ్యడానికి ఏ మాత్రం ఇష్టపడలేదని ఓపెన్ గాని చెప్పింది. ‘‘రామ్ చరణ్ తేజ్ తన ఫేవరెట్ యాక్టర్.. అతడితో అత్తా పిలిపించుకోవడం.. నేను తనని అల్లుడు అంటూ పిలవడం అంటే నేను చెయ్యనుగాక చెయ్యనని డైరెక్టర్ సుకుమార్ దగ్గర మామూలుగా గోల పెట్టలేదు. అలాంటిది ఈ సినిమాలో ఈ రోల్ చేశానంటే నాకున్న ధైర్యం సుకుమారే.. నేను ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ కు తల్లి పాత్రలో కనిపిస్తాననే సోషల్ మీడియాలో తెగ ఊహాగానాలొచ్చాయి. ఇందులో నాది రంగమ్మత్త పాత్రే’’ అంటూ అనసూయ తన రోల్ కు సంబంధించి క్లారిటీ ఇచ్చింది.

‘‘సినిమా చేయడానికి ముందు ఇష్టపడకపోయినా డబ్బింగ్ స్టేజ్ కు వచ్చేసరికి ఆ క్యారెక్టర్ తో కలిసి ట్రావెల్ చేశాను. మా చిట్టిబాబు.. రామలక్ష్మి.. కుమార్ బాబులతో కలిసి మిమ్మల్ని మా ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతామని’’ అనసూయ చెప్పుకొచ్చింది. యాంకర్ గా పాపులరైన అనసూయ సినిమా ఆఫర్లు అప్పుడప్పుడూనే వస్తున్నాయి. రంగస్థలం సినిమా తన కెరీర్ ను కొత్త టర్న్ తిప్పుతుందని రంగమ్మత్త ఆశతో ఉంది. ఆమె ఆశలు ఎంతవరకు నెరవేరతాయో చూడాలి.