పాపం.. అనసూయ.. ఏంటీ పరిస్థితి..

Wed Aug 15 2018 16:53:47 GMT+0530 (IST)


పాపం.. అనసూయ.. ఈ వార్త చదివాక మీరు కూడా అదే అంటారు.. ఆమె ఏదీ చేసినా తప్పులు వెతుకుతున్నారు. దీంతో విసుగుచెంది ఏకంగా ‘ఈరోజు నాకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే కాదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ అనసూయ చేసిన తప్పు ఏంటో తెలుసా.? స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయడం.. ఎగురవేస్తే ఏం తప్పు అని అనుకుంటున్నారా.? కానీ అనసూయ కాస్త ఫ్యాషన్ తో కూడిన డ్రెస్ వేసుకొని ఆ పనిచేసింది. ఆ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అంతే కొందరు తలతిక్క నెటిజన్లు ఊరుకుంటారా.. ఆమెపై కామెంట్ల వరద పారించారు. ఆ కామెంట్లకు తీవ్రంగా బాధపడ్డ అనసూయ ఆ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలోంచి తీసివేసింది. అంతేకాదు.. ‘ఈరోజు నాకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే ’ కాదంటూ రాసుకొచ్చింది..అనసూయ బుధవారం స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో కుటుంబంతో కలిసి సరదాగా విహారానికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో భువనగిరిలోని హోటల్ వివేరాలో టిఫిన్ చేసేందుకు ఆగింది. అప్పుడు స్వాతంత్య దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేస్తున్నారు. అనసూయను చూడగానే హోటల్ యాజమాన్యం సెలెబ్రెటీ కావడంతో జెండా ఎగురవేయాలని కోరారు. దీంతో అనసూయ అంగీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు.  దీనికి గాను హోటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ ఫొటోలు వీడియోలను అనసూయ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

ఈ ఫొటో పోస్ట్ చేయడమే ఆలస్యం.. కొందరు నెటిజన్లు ‘జాతీయ జెండాను ఎగురవేసే సమయంలో ఆ డ్రెస్ ఏంటీ?’ అంటూ కామెంట్లు చేశారు. తనపై వచ్చిన ఈ కామెంట్లను చదివి .. అనసూయ తీవ్ర మనస్థాపం చెందింది. తన వస్త్రాధారణపై నెగెటివ్ గా కామెంట్స్ చేసిన వారిని బ్లాక్ చేస్తూ ఈరోజు నాకు ‘ఈరోజు నాకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే కాదు’ అంటూ వాపోయింది.  తనలా మంచిగా ఆలోచించే వాళ్లు పది మంది ఉన్నా చాలంటూ.. కామెంట్స్ చేసిన వారందరినీ బ్లాక్ చేసేసింది. అనంతరం ఫొటోలు వీడియోలను డిలీట్ చేసింది.