అప్పుడు తిట్టారు కానీ.. అనసూయ రైటే

Mon Apr 23 2018 16:50:33 GMT+0530 (IST)

సినిమా టీజర్ లో పెద్ద బూతు పదం వాడడం.. అర్జున్ రెడ్డి మూవీ విషయంలో జరిగింది. అప్పుడు ఈ అంశంపై హాట్ యాంకర్ అనసూయ తన విచారాన్ని వ్యక్తం చేసింది. టీజర్ లో వినిపించడమే కాకుండా.. అలాగే ఆడియో ఫంక్షన్ లో కుర్రాళ్లతో అదే మాటను హీరో విజయ్ దేవరకొండ అనిపించడాన్ని ఖండించింది.ఆ సమయంలో అర్జున్ రెడ్డి మేనియాలో ఉన్న టాలీవుడ్ ప్రేక్షకులకు.. ఆ పదం ప్రభావం అప్పుడు అర్ధం కాలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో.. నెమ్మదిగా వ్యవహరించాలన్న తన పంథాను ఒక్కసారిగా మార్చుకోవడానికి.. ఆ సినిమాలో ఉపయోగించిన ఆ ఒక్క పదమే కారణం అయింది. అలాగే రాంగోపాల్ వర్మ లాంటి బడా దర్శకుడు.. ఆ పదం ఉపయోగించి పవన్ ను తిట్టమని.. ఓ చిన్నస్థాయి నటిని ప్రోత్సహించి.. ప్రేరేపించాడంటే.. కేవలం సామాన్యులనే కాదు సెలబ్రిటీలను ఈ బూతు అంతగా అట్రాక్ట్ చేసిందని అనిపిస్తుంది.

తన వలువలను నడి రోడ్డుపై విప్పదీసుకుని మరీ క్యాస్టింగ్ కౌచ్ గురించి పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి.. తను తెచ్చుకున్న మొత్తం అటెన్షన్ ను పోగొట్టుకోవడానికి ఈ ఒక్క పదమే కారణం అయింది. అమ్మను తిట్టే విధంగా ఉన్న ఈ బూతుకు అంతగా ప్రచారం కల్పించడం కరెక్ట్ కాదని.. అనసూయ అప్పుడు చెబితే.. అందరూ హేళన చేశారు. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ చూస్తే.. ఆనాడు అనసూయ ఎందుకంత బాధ పడిందో అర్ధం అవుతుంది.