Begin typing your search above and press return to search.

తెలుగు ఆడియన్స్‌ షాక్‌ అయిపోతారేమో

By:  Tupaki Desk   |   30 Nov 2015 6:42 AM GMT
తెలుగు ఆడియన్స్‌ షాక్‌ అయిపోతారేమో
X
ఇదిగో .. ఏవండీ.. మా అక్క వాళ్లు ఈ సిటీలోనే ఉంటున్నారు. అడ్రెస్ చెప్ప‌రూ ప్లీజ్‌!! అంటూ అమాయ‌క‌త్వం క‌ల‌బోసిన మాట‌ల‌తో ఆక‌ట్టుకుంది అన‌న్య‌. సిటీలో కొంటె కుర్రాళ్లు కొర‌కొరా చూస్తారు. వ‌ల‌పు దోచేస్తారు జాగ్ర‌త్త‌గా ఉండు! అంటే అవున‌వును జాగ్ర‌త్త‌గానే ఉంటా.. అన్న‌ట్టే క‌నిపించింది ఈ అమ్మ‌డు. ఇదంతా సురేష్ కొండేటి అందించిన త‌మిళ అనువాద చిత్రం `జ‌ర్నీ`లో సీన్‌. మ‌ల‌యాళ బ్యూటీ అన‌న్య ఇంప్రెస్సివ్ పెర్ఫామ‌ర్‌ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ సినిమాతో. అయితే తానొక‌టి త‌లిస్తే విధి వేరొక‌టి త‌ల‌చిన‌ చందంగా ఈ అమ్మ‌డి కెరీర్ టాలీవుడ్‌ లో ఆశించిన స్థాయికి ఎద‌గ‌లేదు.

కృష్ణుడు సర‌స‌న అన‌న్య అమాయ‌కుడు అనే చిత్రంలో న‌టించింది. కానీ ఆ సినిమా ఆశించిన బ్రేక్‌ నివ్వ‌లేదు. ఆ క్ర‌మంలోనే శ్రీ‌రామ‌రాజ్యం నిర్మాత త‌న‌యుడిని ప‌రిచ‌యం చేస్తూ తెర‌కెక్కించిన ఇంటింటా అన్న‌మ‌య్య లో నాయిక‌గా అందుకున్నా ఆ సినిమా రిలీజ్ కానేలేదు. కార‌ణం ఏదైనా రేసులో పూర్తిగా వెన‌క‌బ‌డింది. కానీ ఇన్నాళ్టికి త‌న‌ని అనుకోని రీతిలో అదృష్టం త‌లుపు త‌ట్టింది. అయితే ఈసారి ఛాన్స్.. హీరోయిన్‌ గా కాదు.. చెల్లెలి పాత్ర కోసం.

అది కూడా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `అ.. ఆ` మూవీలో. ఈ చిత్రంలో నితిన్‌ కి చెల్లెలుగా న‌టిస్తోంది అన‌న్య‌. ఒక మెయిన్ స్ర్టీమ్ హీరోయిన్ చెల్లాయి పాత్ర‌కు అంగీక‌రిస్తే ఇక కెరీర్ అయిపోయిన‌ట్టే. ఇక‌నుంచి అక్క‌ - చెల్లి - వ‌దిన పాత్ర‌ల‌తో స‌రిపెట్టుకోవాల్సిందే. కానీ త‌న క్యారెక్ట‌ర్ ఛాలెంజింగ్‌ గా ఉండ‌డం వ‌ల్ల‌నే అంగీక‌రించాన‌ని అన‌న్య చెబుతోంది. ముందు భయపడ్డాను.. కాని క్యారెక్టర్‌ టోన్‌ నచ్చడంతో ఓకె చేసేశాను. బహుశా తెలుగు ఆడియన్స్‌ షాక్‌ అయిపోతారేమో. ఏదైతేనేం జ‌గ‌ప‌తిబాబులా యూట‌ర్న్ తీసుకున్నాక వ‌రుస‌గా ఛాన్సులొస్తాయేమో చూడాలి.