Begin typing your search above and press return to search.

అనంతపురం పిల్లతో అర్జున్ రెడ్డి రొమాన్స్

By:  Tupaki Desk   |   16 Oct 2017 12:58 PM GMT
అనంతపురం పిల్లతో అర్జున్ రెడ్డి రొమాన్స్
X
ఏ ముహూర్తంలో 'అర్జున్ రెడ్డి' సినిమాను చేశాడో తెలియదు కాని.. ఆ క్షణం నుండి హీరో విజయ్ దేవరకొండను అందరూ ఎక్కువగా ఆ సినిమా పేరుతోనే పిలుస్తున్నారు. ఇప్పుడు మనోడు కొత్తగా ఒక అనంతనపురం పిల్లను రొమాన్స్ చేస్తున్నాడు తెలుసా!! అసలు ఇంతకీ ఎవరా పిల్ల.. ఏంటా కహానీ? పదండి చూద్దాం.

ఇప్పటికే చాలా షార్ట్ ఫిలింస్ లో నటించిన యుట్యూబ్ ద్వారా పాపులర్ అయిపోయిన పిల్ల ప్రియాంక జవాల్కర్. అమ్మడు అవ్వడానికి మహారాష్ట్రకు చెందిన బ్యూటి అయినా కూడా.. పుట్టింది పెరిగింది అంతా అనంతపురంలోనే. అందుకే తెలుగు రాస్తుంది - చదువుతుంది - మాట్లాడుతుంది. ఈ అమ్మడు షార్ట్ ఫిలింస్ లో చేస్తూ ఫ్యాషన్ డిజైన్ కోర్సుల కోసం అమెరికా కూడా వెళ్ళొచ్చిందట. తరువాత గీతా ఆర్ట్స్ కు ఈమె ఫోటోలు పంపడంతో.. రాహుల్ సంక్రిత్యాన్ అనే సినిమాటోగ్రాఫర్ లో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న సినిమాలో ఈమెను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో మాళవికా నాయర్ మరో హీరోయిన్ గా చేస్తోంది.

కేవలం పోర్ట్ ఫోలియో ఫోటోషూట్లలోనే తన ఒంపుసొంపుల వేడిమితో తెగ ఆకట్టేసుకున్న ఈ సెమీ రాయలసీమ సుందరి.. ఇప్పుడు వెండితెరపై తన సత్తా చూపించడానికి రెడీ అయిపోతోంది. మరి యుట్యూబ్ నుండి వచ్చిన తమ హొయలను ఒలికిస్తున్న రెజీనా కసాండ్రా.. చాందిని చౌదరి సరసన చేరుతుందేమో చూద్దాం.