షార్ట్ ఫిలిం డైరెక్టర్ గా నాని సిస్టర్

Sun Jun 16 2019 23:24:24 GMT+0530 (IST)

న్యాచురల్ స్టార్ నాని నిన్న సాయంత్రం ఒక తన సోషల్ మీడియా ఖాతా ద్వారా 'అనగనగా ఒక నాన్న' అనే ఒక పోస్టర్ ను షేర్ చేస్తూ ఒక ప్రకటన చేశాడు.  "రేపు సాయంత్రం 6 గంటలకు ఈ సూపర్ స్వీట్ షార్ట్ ఫిలిం మీ ముందుకు రానుంది. దీప్తి గంటా అంటే నా సిస్టర్ కదా?  రచన.. దర్శకత్వం అని ఉంది ఏంటి? ఈ ట్విస్ట్ ఏంటో రేపు చూద్దాం" అంటూ ట్వీట్ చేశాడు.పోస్టర్ లో క్యూట్ గా కనిపించే ఒక అమ్మాయి నోట్ బుక్ ముందు పెట్టుకొని చదువుతూ ఉంది. షార్ట్ ఫిలిం టైటిల్ ను బట్టి చూస్తే ఇది నాన్న- కూతురు మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ స్టొరీలా అనిపిస్తోంది.  ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు కాబట్టి ఈ థీమ్ తో రూపొందించిన షార్ట్ ఫిలిం ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం పర్ఫెక్ట్ టైమింగ్.   మరి నాని సోదరి మొదటిసారిగా కథ రాసి.. దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిలిం అందరినీ మెప్పిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

ఇదిలా ఉంటే నాని ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఒక ఒక ఫోటో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో నాని స్మైల్ ఇస్తూ ఉండగా.. నేపథ్యంలో నాని నాన్నగారు నవ్వుతూ ఉన్నారు. ఈ ఫోటోకు "మీరునా వెనకే ఉన్నారు.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.