Begin typing your search above and press return to search.

తెలుగు కోసం గోవాలో యోగ చేస్తోంది

By:  Tupaki Desk   |   23 Jun 2017 4:40 AM GMT
తెలుగు కోసం గోవాలో యోగ చేస్తోంది
X
అందాల భామ అమైరా దస్తూర్ టాలీవుడ్ తెరంగేట్రం చేస్తోందంటూ గత రెండేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. చాలానే ప్రాజెక్టుల్లో ఈమె పేరు వినిపించినా.. ఎట్టకేలకు రెండు తెలుగు సినిమాలకు సైన్ చేసింది. జాకీచాన్ తో కలిసి కుంగ్ ఫూ యోగ చిత్రానికి సైన్ చేయడం కారణంగానే.. చాలా సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని చెబుతోంది అమైరా దస్తూర్.

'జాకీచాన్ తో కలిసి నటించడం అంటే చాలా పెద్ద విషయం. చాలా పెద్ద ప్రాజెక్ట్ కూడా. ఏడాదిన్నరకు పైగా సమయం కేటాయించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆఫర్స్ మిస్ అయినందుకు బాధ పడ్డం లేదు. ఇప్పుడు తెలుగు సినిమా షూటింగ్ ప్రారంభించేసినందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతోంది. నేను ఏడాదికి గోవా చాలాసార్లు వస్తాను. కానీ నాకు గోవాలో తెలియని అందాలను.. ఈ సినిమా కారణంగా తెలుసుకోగలుగుతున్నాను' అని చెప్పింది అమైరా.

'ఈ మూవీలో యోగ ట్యూటర్ గా పని చేస్తున్నాను. స్క్రిప్ట్.. కేరక్టర్ నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నాను. రియల్ లైఫ్ లో కూడా నాకు ప్రకృతి చాలా ఇష్టం. సిటీ లైఫ్ నే ఇష్టపడతాను. కాంక్రీట్ జంగిల్ అన్నాసరే నాకు అదే ఇష్టం. ప్రస్తుతం నాకు తెలుగులో కొన్ని పదాలు తెలుసు. తెలుగు నేర్చుకోవడం ప్రారంభిస్తున్నాను. అలాగే ఈ సినిమా కోసం డ్యాన్సింగ్ కూడా విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నా' అని చెప్పింది అమైరా దస్తూర్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/