Begin typing your search above and press return to search.

కొలనులో కొలతలు చూపిస్తోంది

By:  Tupaki Desk   |   29 May 2017 4:28 PM GMT
కొలనులో కొలతలు చూపిస్తోంది
X
అందాల భామలు ఏం చేసినా అభిమానులకు బాగానే ఉంటుంది. అందాల ఆరబోతలో ఎలాంటి అడ్డంకులు పెట్టుకోని వారికి.. అభిమాన గణం కాసింత ఎక్కువగా ఉంటుందని అనడంలో సందేహం లేదు. ఈ తరం సుందరీమణుల్లో అనేకమంది ఒయ్యారాలు ఒలికించడంలో ఏ మాత్రం రాజీ పడ్డంల లేదు. ఇక మోడలింగ్ నుంచి ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన సుందరాంగులు అయితే.. ఈ విషయంలో ఎప్పటికప్పుడు ఓ అడుగు ముందే ఉంటున్నారు.

16 ఏళ్లకే మోడలింగ్ లో అడుగుపెట్టేసిన ముంబై భామ అమైరా దస్తూర్.. ఇప్పటికే లెక్కలేనన్ని యాడ్స్ లో కనిపించింది. ఈ భామ నటించిన సినిమాల కౌంట్ తక్కువగానే ఉంటుంది కానీ.. ఫ్యాన్స్ ను ఆకర్షించే విషయంలో మాత్రం బాగానే స్పీడ్ చూపిస్తుంది. స్విమ్మింగ్ పూల్ లో టూ పీస్ బికినీతో అమైరా దస్తూర్ హొయలు పోతున్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఒంపుసొంపులు ఆరేస్తూ.. మోకాళ్ల వరకు నీళ్లలో నుంచున్న అమైరా.. ఫ్యాన్స్ ను తెగ అట్రాక్ట్ చేసేస్తోంది.

ఈత కొలనులో కాసింత దిగిన ఈ సుందరాంగి.. తన కొలతలు అన్నీ క్లియర్ గా కనిపించేలా ఇచ్చిన పోజ్ కు ఫ్యాన్స్ బాగానే కనెక్ట్ అయిపోయారు. ఇక అమైరా దస్తూర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కమెడియన్ సంతానం హీరోగా రూపొందుతోన్న ఊడి ఊడి ఊళైకనుం అనే మూవీలో నటిస్తోంది. అమైరా. జాకీ చాన్ మూవీ చేసి ఆ వెంటనే కమెడియన్ తో సినిమా.. తెలుగులో సందీప్ కిషన్ తో మంజుల డైరక్షన్లో సినిమా చేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/