Begin typing your search above and press return to search.

అలా ఎగురుతుంటే మనసు ముక్కలే

By:  Tupaki Desk   |   20 Feb 2017 3:47 PM GMT
అలా ఎగురుతుంటే మనసు ముక్కలే
X
మోడల్ కం యాక్ట్రెస్ గా అమైరా దస్తూర్ ట్యాలెంట్ చూపించేస్తూ ఉంటుంది. బాలీవుడ్ కం కోలీవుడ్ సినిమాల్లో సందడి చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా కుంగ్ ఫు యోగ అంటూ జాకీచాన్ మూవీలో కూడా నటించి.. ఇంటర్నేషనల్ గా క్రేజ్ సంపాదించుకుంది. బేసిక్ గా మోడల్ అయిన అమైరాకు ఫోటో షూట్స్ తో మైమరపించేయడం బాగానే అలవాటు.

తాజాగా ఇలాంటిదే ఓ ఫోటో షూట్ చేసి.. చూపరుల మనసులకు కోలుకోలేని గాయాలు చేసేస్తోంది. స్విమ్ వేర్ మాదిరిగా ఓ బికినీ టైపులో డ్రస్ వేసి.. దానికి ఫ్లవర్ డిజైన్ తో ట్రాన్స్ పరెంట్ గౌన్ ని తగిలించింది. అమైరా అందాలను దాచలేక అసలే ఆ దుస్తులు మహా ఇబ్బంది పడిపోతుంటే.. వాటిని మరింత కష్టపెట్టేసింది ఈ భామ. గాల్లోకి ఎగురుతూ ఓ ఫోటోకి పోజ్ ఇవ్వడంతో.. గౌను కూడా ఎగిరిపోతోంది.

ఎగిరోపోతోన్న అందాల మధ్యలో అమైరా సౌందర్యాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలని పరిస్థితి. బాలీవుడ్ లో ప్రతీక్ బబ్బర్ నటించిన ఇజాక్ మూవీతో అరంగేట్రం చేసిన అమైరా.. ధనుష్ తో కలిసి అనేగన్(తెలుగులో అనేకుడు) మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం కూడా 'ఊడి ఊడి ఉఝాయ్ కనుమ్' అనే తమిళ్ చిత్రంలో చేస్తోంది అమైరా దస్తూర్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/