Begin typing your search above and press return to search.

థ్రిల్ చేసేందుకు అమైరా రెడీ

By:  Tupaki Desk   |   16 July 2017 4:55 AM GMT
థ్రిల్ చేసేందుకు అమైరా రెడీ
X
అందాల భామ అమైరా దస్తూర్ టాలీవుడ్ ఎంట్రీ చాలాకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మొత్తానికి ఈ భామ తెలుగులో కనిపించేయనుంది. సందీప్ కిషన్ హీరోగా మంజుల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది అమైరా దస్తూర్.

24 ఏళ్ల ఈ భామ.. ఇప్పుడు మరో సినిమా కూడా అంగీకరించింది. ఈసారి బాలీవుడ్ మూవీ యాక్సెప్ట్ చేసిన అమైరా దస్తూర్.. ఈసారి జనాలను థ్రిల్ చేసేందుకు ఫిక్స్ అయింది. కాలాకాండీ అనే టైటిల్ పై రూపొందనున్న మూవీలో.. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. అమైరా లీడ్ రోల్ కు ఎంపికైంది. ఢిల్లీ బెల్లీ మూవీకి స్టోరీ అందించిన అక్షత్ వర్మ.. ఈ కాలాకాండీకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం ఒప్పుకోవడంపై వివరించింది అమైరా దస్తూర్. తాను సినిమాలు ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటానని.. ఆఫర్స్ అన్నిటినీ ఒప్పుకోలేనని చెబుతోంది అమైరా.

'నేను సినిమాలు అంగీకరించడంలో బాగా సెలెక్టివ్ గా ఉంటాను. గతంలో కొన్ని హిందీ సినిమాలు.. ఓ తమిళ్ చిత్రం.. ఇంటర్నేషనల్ మూవీ కుంగ్ ఫూ యోగా చేశాను. నన్ను ఎక్సైట్ చేయడమే నాకు ముఖ్యం. కాలాకాండీలో నేను ఎదురుచూసిన పాయింట్స్ ఎన్నో ఉంటాయి' అని చెప్పిన అమైరా.. ఇదే థ్రిల్లింగ్ కామెడీ మూవీ అని చెప్పింది. ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ కూడా కీలకపాత్ర పోషిస్తుండగా.. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ లో సైఫ్- అమైరాలు డ్యాన్స్ తో అదరగొట్టేశారు.