Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: అందాల టోర్నెడోతో భద్రం

By:  Tupaki Desk   |   16 July 2018 9:20 AM GMT
ఫోటో స్టోరీ: అందాల టోర్నెడోతో భద్రం
X
దక్షిణాదిన అదృష్టం కలిసి రాక హీరోయిన్ గా స్థిరపడలేకపోయింది కానీ.. ముంబయి భామ అమైరా దస్తూర్ లో ఒక స్టార్ హీరోయిన్ కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. తన అందంతో జాకీ చాన్ ను సైతం మెప్పించి అతడి సినిమాలో కథానాయికగా చేసింది అమైరా. ధనుష్ సరసన ‘అనేగన్’ అనే సినిమా ద్వారా కోలీవుడ్ కు.. కృష్ణ కూతురు మంజుల దర్శకురాలిగా పరిచయమైన ‘మనసుకు నచ్చింది’ ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయిందీ భామ. కానీ ఈ సినిమాలు ఆడకపోవడంతో ఆమె కెరీర్ ఊపందుకోలేదు. తాజాగా రాజ్ తరుణ్ సరసన ‘రాజు గాడు’ అనే సినిమా చేసింది. అది కూడా ఆడలేదు. కానీ ఈ సినిమా ఫలితాలెలా ఉన్నా.. అమైరా అందాలు మాత్రం కుర్రకారును ఆకట్టుకున్నాయి.

ఆ అందంతోనే సోషల్ మీడియాలో తన ఫాలోవర్లను మురిపిస్తూ ఉంటుంది అమైరా. తాజాగా ఆమె ఒక హాట్ ఫొటో షూట్ చేసింది. అందులోంచి ఒక మెరుపులాంటి ఫొటోను అభిమానులతో పంచుకుంది. అందమైన కళ్లు.. హార్ట్ బీట్ ఉన్నా టోర్నడో ఈమె అంటూ తనను తాను కాంప్లిమెంట్ ఇచ్చుకుంది అమైరా. ఈ ఫొటో చూస్తే ఆమె వ్యాఖ్యలు అతిశయోక్తిలాగా ఏమీ అనిపించవు. అమైరా కళ్లు అంతలా మాయ చేస్తున్నాయి. అలాగే క్లీవేజ్ అందాలు కూడా కుర్రాళ్లను రెచ్చగొడుతున్నాయి. ఈ అందాల టోర్నెడోను చూసి అబ్బాయిలు లయ తప్పకుండా ఉండటం కష్టమే. దక్షిణాదిన చేదు అనుభవాలు ఎదుర్కొన్న అమైరా ప్రస్తుతం బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తోంది. మరి అవైనా ఈమె టాలెంటుకు తగ్గ ఫలితాన్నిచ్చి హీరోయిన్ గా బిజీ అయ్యేలా చేస్తాయేమో చూడాలి.