Begin typing your search above and press return to search.

మెగా కాదు.. మంచు క్యాంప్ తో అమైరా

By:  Tupaki Desk   |   29 Nov 2015 5:30 PM GMT
మెగా కాదు.. మంచు క్యాంప్ తో అమైరా
X
అమైరా దస్తూర్.. ఈ బాలీవుడ్ భామ చెర్రీ మూవీతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తుందని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ధనుష్ నటించిన అనేకుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా.. డైరెక్ట్ తెలుగు మూవీ ఏదీ లేదు. మొదటి మూవీనే మెగా క్యాంప్ లో చేయనుందంటూ.. బాగానే వార్తలొచ్చాయి. అయితే.. ఇప్పుడు సడెన్ గా సీన్ మారిపోయింది. ఈ భామ మంచు హీరోతో ఇండస్ట్రీలోకి ఇవ్వనుండడం ఖాయమైంది.

లోఫర్ పూర్తి కాగానే.. పూరీ జగన్నాథ్ రోగ్ అనే షూట్ స్టార్ట్ చేసేశాడు. ఇది తెలుగు - కన్నడ ద్విభాషా చిత్రం. ఇందులో హీరోయిన్ గా సైన్ చేయడమే కాదు.. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసింది అమీరా దస్తూర్. దీంతో పాటే మంచు విష్ణు - రాజ్ తరుణ్ లు నటించనున్న మల్టీ స్టారర్ మూవీలో హీరోయిన్ గా ఎంపికైంది అమీరా. ఈ మూవీలో విష్ణుకి జంటగా నటించనుంది ఈ చిన్నది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడు.

అనిల్ సుంకర నిర్మించనున్న ఈ చిత్రానికి డైరెక్టర్ జి నాగేశ్వరరెడ్డి. వచ్చే ఏడాది ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ కి జంటగా అవికా గోర్ ని తీసుకోవాలని అనుకున్నా.. కాంబినేషన్ సెట్ కాలేదు. దీంతో హేభా పటేల్ ని తీసుకుంటున్నట్లు సమాచారం. విష్ణుకి జంటగా అమైరా నటించనుంది. ఒకేసారి రెండు క్రేజీ ప్రాజెక్టులతో టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది అమైరా దస్తూర్.