Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: శ్రీలంకలో బికినీ మోత

By:  Tupaki Desk   |   22 March 2017 5:28 AM GMT
ఫోటో స్టోరి: శ్రీలంకలో బికినీ మోత
X
ఈ మధ్యన హీరోయిన్లు అందరూ ఒకటే పాట పాడుతున్నారు. చేతిలో ఆఫర్లు లేకపోతే వెంటనే ఎక్కడో చోటికి హాలిడేకి చెక్కేసి.. అక్కడ బికినీలు వేసుకుని ఫోటోలు వీడియోలు తీయించుకుని.. వాటిని నెట్టింట్లో పెట్టేస్తున్నారు. దానితో ఎక్కడలేని క్రేజ్ వెంటనే వచ్చేస్తోంది. తద్వారా కొన్ని ఆఫర్లు కూడా వస్తున్నాయి. అలాంటి ఫీటునే మొన్న మంజరి ఫద్నిస్.. త్రిథా చౌదరి వంటి హీరోయిన్లు చేయగా.. ఇప్పుడు అమైరా దస్తూర్ కూడా ఆ జాబితాలోనే చేరింది.

ఇప్పటికే రాజ్ తరుణ్‌ సినిమా.. రోగ్ మూవీ.. మంచు విష్ణు మూవీ అంటూ అమైరా చాలా సినిమాల్లో ఉన్నట్లు వార్తలొచ్చినా వాటిలో ఏది మెటీరియలైన్ అవుతుందో ఫైనల్ గా మాత్రం తెలియదు. కాకపోతే ఒక వారం క్రితం కొలంబోలోని కింగ్స్ బరీ హోటల్ కు వెళ్ళిన అమైరా దస్తూర్.. అక్కడ తన బికినీ విన్యాసాలతో అందరికీ మతిపోగొట్టేసింది. రెగ్యులర్ గా శ్రీలంక టూర్ కు వెళ్ళే సెలబ్రిటీస్ అందరికీ ఈ హోటల్ బాగా సుపరిచితమే. అక్కడి స్విమ్మింగ్ పూల్ లో అమ్మడు ఇలా టూ పీస్ లో సందడి చేసింది అనగానే.. వావ్ అంటూ నోరు తేలేస్తున్నారు వారు.

ఈ బికినీ అందాల మోతతో ఖచ్చితంగా తాను వెండితెరపై కూడా సంచలనం సృష్టించడానికి రెడీగా ఉన్నానంటూ అమైరా మనకు పచ్చ జెండా ఊపేసినట్లే. మరి తెరపై ఆమె ఆఫర్ ను అందిపుచ్చుకునే సినిమా వారు ఎవరో తెలియాలంటే.. కాస్త వేచి చూడాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/