Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: స్పీడ్ మీదున్న పింక్ హార్స్

By:  Tupaki Desk   |   8 Oct 2015 7:30 PM GMT
ఫోటో స్టోరీ: స్పీడ్ మీదున్న పింక్ హార్స్
X
ఇప్పుడు మహా హుషారుగా ఉంది అమీ జాక్సన్. ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న హిట్.. సింగ్ ఈజ్ బ్లింగ్ తో దక్కింది ఈమెకు. గ్లామర్ - పెర్ఫామెన్స్ - ట్యాలెంట్.. ఇలా అన్నీ రంగరించినా.. హిట్ పడలేదు ఏళ్ల తరబడి. చివరకు దిగ్గజ డైరెక్టర్ శంకర్ కూడా ఐ అంటూ అట్టర్ ఫ్లాప్ నే ఇచ్చాడు. దీంతో చాలా నిరుత్సాహపడ్డ అమీ... ఆ తర్వాత అన్ని రకాలుగానూ రూట్ మార్చేసింది.

ప్రభుదేవా డైరెక్షన్ లో అక్షయ్ కుమార్ తో కలిసి చేసిన సింగ్ ఈజ్ బ్లింగ్ కు మొదటి నుంచి సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అమీయే. మూవీలో లారాదత్తా లాంటి సీనియర్ ఉన్న కూడా.. ఆమెను డామినేట్ చేసేసింది. ఇందుకోసం బాగానే కష్టపడింది అమీ. ఒళ్లుదాచుకోకుండా వేసిన పింక్ బికినీ.. మొదట సింగ్ ఈజ్ బ్లింగ్ కు క్రేజ్ తెచ్చిపెట్టగా.. ప్రమోషన్ ఈవెంట్లలోనూ హుషారుగా పాల్గొంది అమీ. అలా సింగ్ ఈజ్ బ్లింగ్ కోసం చేసిన ఓ ప్రమోషనల్ ప్రోగ్రామ్ లో వేసినదే.. పైన కనిపిస్తున్న ఫోటో. పింక్ కలర్ చోళీకి, కొంచెం ముదురు రంగు డిజైనర్ లంగా వేసి.. వామ్మో అనే రేంజులో ఎద అందాలు ఆరబోసేసింది అమీ.

ప్రమోషన్స్ లోనే ఇంత సందడి ఉంటే.. సినిమాలో ఎంతగా రెచ్చిపోయిందో అనే టాక్ వినిపించింది అప్పట్లోనే.అందుకు తగ్గట్టే బికినీ లుక్‌ లో.. పొట్టి బట్టల్లో ఫైట్లు కూడా చేసి అలరించేసింది. మొత్తానికి ఏళ్లతరబడి ఎదురుచూసిన సక్సెస్ రావడంతో.. ఇప్పుడు ఫుల్ జోష్ మీదుంది అమీ జాక్సన్. జనాలకు ఏం కావాలో, ఎలా ఇవ్వాలో బాగా తెలిసిపోయింది నాకు అంటోందిపుడు. చూస్తుంటే తర్వాతి సినిమాల్లో మరింతగా రెచ్చిపోయేట్లుగా కనిపిస్తోంది. స్పీడ్ మీదున్న గుర్రాన్ని ఆపడం కష్టం సుమీ..