ఫస్ట్ లుక్ః రోబో ఆమీని చూశారా!!

Wed Oct 11 2017 18:39:08 GMT+0530 (IST)

దేశం మెచ్చిన దర్శకుడు శంకర్ రుపొందిస్తున్న ఇండియన్ బిగ్గెస్ట్ ఫిల్మ్ 2.0. ఇప్పటివరకు ఎవ్వరు చేయలేని పెద్ద మ్యాజిక్ ని శంకర్ స్క్రీన్ పై చూపించబోతున్నాడు మొట్ట మొదటి సారి ఇండియాలో ఒక సైంటిఫిక్ సినిమాను 3డి ఫార్మాట్ లో చూపించబోతున్నాడు. అయితే ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా గ్రాఫిక్స్ పనులలో బిజీగా ఉంది.సాధారణంగా మనోడు సినిమా పూర్తయ్యేవరకు ఎన్ని పోస్టర్ లను ట్రైలర్ లను రిలీజ్ చేసినా ప్రేక్షకుడికి ఆసక్తిని రేపుతాడు గాని సినిమా కథ గురించి ఏ మాత్రం తెలియనివ్వడు. రీసెంట్ గా శంకర్ 2.0 లో హీరోయిన్ అమీ జాక్సన్ ఫస్ట్ పోస్టర్ ని రిలీజ్ చేశాడు. పోస్టర్ లో అమీ టెక్నాలజీ కాస్ట్యూమ్ తో ఆకట్టుకుంటోంది. రోబో తరహాలో ఉందీ అమ్మడు. శంకర్ ప్రతి సినిమాలో హీరోయిన్స్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అదే తరహాలో అమీ పాత్ర కూడా ఈ సినిమాలో చాలా కీలకం కానున్నట్లు తెలుస్తోంది. అందమైన లుక్స్ తో అమీ ఇచ్చిన ఫోజు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చూస్తుంటే అమ్మడు కూడా సినిమాలో పవర్స్ కలిగి ఉంటుందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం కూడా ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా నిలుస్తుందట. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం రెహమాన్ కొత్త తరహా  టేెక్నాలజీని వాడుతున్నాడట. లైకా ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి లో రిలీజ్ కానుంది.