లోదుస్తుల్లో ఫోజులివ్వడం మానట్లేదే

Thu Oct 19 2017 21:00:01 GMT+0530 (IST)

చాలామంది అమ్మాయిల తొలుత మోడలింగ్ లో కెరియర్ మొదలెడతారు. ఆ తరువాత నిధానంగా సినిమాల్లోకి వస్తారు. ఒక్కసారి సినిమాల్లో క్లిక్ అయ్యాక.. ఎవరన్నా పేరు మోసిన డిజైనర్ల కోసం ర్యాంపు వాకులు లేదంటే పెద్ద పెద్ద యాడ్లకు మోడలింగ్ చేయడం తప్పిస్తే చిన్న చిన్న ఎసైన్మెంట్లు మాత్రం తీసుకోరు.అదిగో మనం దీపికా పదుకొనె అండ్ సమంతనే ఉదాహరణలుగా తీసుకోవచ్చు. వారు మోడలింగ్ నుండి సినిమా స్టార్లు అయిపోయాక మాత్రం.. అస్సలు వేరే చిన్న యాడ్లు చేయనేలేదు. కాని బ్రిటీష్ బ్యూటి అమీ జాక్సన్ ఉంది చూశారు.. ఆమె కెరియర్ మొదట్లో లింజరీ (లోదుస్తులు) కోసం చాలా మోడలింగ్ చేసింది. పూర్తి స్థాయి ట్రాన్సపెరెంట్ బ్రా అండ్ బ్రీఫ్ లలో కనిపించింది. కాని ఇప్పుడు రజనీకాంత్ వంటి స్టార్ పక్కన హీరోయిన్ కూడా అయిపోయింది. అయినా కూడా అలాంటి బ్రాండ్లకు ఇంకా ఫోజులిస్తూనే ఉంది.

అప్పట్లో నెల్లీస్ స్విమ్ వేర్ వంటి బ్రాండ్లకు ఫోజులిచ్చిన అమీ.. ఇప్పుడు లిప్సీ అనే కొత్త బ్రాండు కోసం అలానే హొయలు పోయింది. ఆ ఫోటోలు చూస్తే మీకే విషయం అర్దమవుతోందిగా.