Begin typing your search above and press return to search.

అమీ జాక్సన్ ఫస్ట్‌ బ్రేక్‌

By:  Tupaki Desk   |   5 Oct 2015 10:30 PM GMT
అమీ జాక్సన్ ఫస్ట్‌ బ్రేక్‌
X
అమీ జాక్సన్ మొత్తానికి ఓ హిట్ కొట్టింది. ఐదేళ్ల క్రితం ఇండస్ట్ రీలో అడుగుపెట్టి.. పెద్ద పెద్ద ప్రాజెక్టు లే చేసినా.. ఇప్పటివరకూ ఒకటంటే ఒకటి కూడా చెప్పుకోదగ్గ హిట్ లేదు. తెలుగులో ఎవడు హిట్ అయినా.. అందులో ఫిమేల్ లీడ్ కేరక్టర్స్ కాజల్, శృతిహాసన్ ల పక్కన చిన్న రోల్ అయిపోయింది. ఆ తర్వాత శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఐ మూవీ లో లీడ్ కేరక్టర్ పోషించడం తో చాలానే ఆశలు పెట్టుకుంది. కానీ అది ఊహించని దెబ్బ కొట్టింది. అంతకుముందు తెలుగు లో సూపర్ హిట్ అయిన ఏ మాయ చేశావే హిందీ రీమేక్ ఏక్ దీవానా థా చిత్రం లో అందాలు ఆరబోసి కష్టపడ్డా ఫలితం దక్కలేదు.

కానీ ఎట్టకేలకు ఓ సక్సెస్ వచ్చింది. అది కూడా ఫ్లాపుల తో ఇబ్బంది పడుతున్న ప్రభుదేవా.. సింగ్ ఈజ్ బ్లింగ్ తో.. తాను ఫాంలో కి వచ్చి అమీకి సక్సెస్ ఇచ్చాడు. ఈ మూవీ తొలి మూడు రోజుల్లో నే రూ. 54 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టించింది. తొలి వీకెండ్ కలెక్షన్స్ విషయంలో అక్షయ్ కుమార్ కు ఇదే బిగ్గెస్ట్ రికార్డ్. ఐదేళ్ల పాటు ఎదురు చూసిన తర్వాత.. అంచనాలకు తగిన హిట్ రావడం తో.. ఫుల్ ఖుషీగా ఉంది అమీ. ప్రస్తుతం తమిళ్ లో విఐపీ2, గేతులతోపాటు.. విజయ్ మూవీ లో కూడా నటిస్తోంది అమీ జాక్సన్.