Begin typing your search above and press return to search.

రోబో 2లో బ్రటీష్‌ గాళ్‌?

By:  Tupaki Desk   |   13 Oct 2015 5:32 AM GMT
రోబో 2లో బ్రటీష్‌ గాళ్‌?
X
బ్రిటీష్‌ బ్యూటీ ఎమీజాక్స‌న్ న‌క్క‌తోక తొక్కి సౌత్‌ లో అడుగుపెట్టింది. అందుకే ఈ అమ్మ‌డు ఇక్క‌డ సూప‌ర్‌ స్టార్‌ గా ఎదిగేసింది. ముఖ్యంగా త‌మిళ తంబీలు ఈ అమ్మ‌డికి రెడ్ కార్పెట్ వేసి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఓ వైపు స్టార్ హీరోలు, మ‌రోవైపు స్టార్ డైరెక్ట‌ర్‌-ప్రొడ్యూస‌ర్స్ ఈ అమ్మ‌డిని ఏరి కోరి ఛాన్సులిస్తున్నారు. ఏమీ లేనిదే ఏదీ చేయ‌లేం అని ఫిక్స‌యిపోయారంతా. అందుకే మ‌ద‌రాసి ప‌ట్ట‌ణం నుంచి ఎమీజాక్స‌న్ కంటిన్యూగా తంబీల సినిమాల్లో అవ‌కాశాలు అందుకుంటోంది.

ఎమీ జీవితంలో ఒకే ఒక్క మ‌లుపు. అది శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఐ చిత్రంలో అవ‌కాశం రావ‌డం. ఆ త‌ర్వాత స్టార్‌ డ‌మ్ చుక్క‌ల్ని తాకింది. ఆ సినిమాలో ఎమీ అందాల్ని అద్భుతంగా ఆవిష్క‌రించాడు శంక‌ర్‌. అంతేకాదు ఇప్పుడు ఏకంగా సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న రోబో2 చిత్రంలోనూ అవ‌కాశం ఇచ్చాడు. ఈ సినిమాలో ఎమీజాక్స‌న్ ప్ర‌ధాన నాయిక‌గా న‌టిస్తోంది. రోబో చిత్రంలో ఐశ్వ‌ర్యారాయ్ క‌థానాయిక‌గా న‌టించింది. ఐష్ ఇప్పుడు వేరే సినిమాల‌తో బిజీగా ఉంది. కాబ‌ట్టి ఎమీని ఈ అవ‌కాశం వ‌రించింది.

ఇటీవ‌లే లాస్ ఏంజెల్స్‌ లో కొంత కాలం ఈ అమ్మ‌డు స్పెండ్ చేసి వ‌చ్చింది. అక్క‌డ ఈ భామ‌కి సంబంధించి మౌల్డ్ (విగ్ర‌హాకారం)ఒక‌టి సిద్ధం చేశారు. ఆ మౌల్డ్ కి స‌రిప‌డే దుస్తుల్ని, అలంక‌ర‌ణ వస్తువుల్ని అక్క‌డే డిజైన్ చేయ‌నున్నారు. 2016 ప్రారంభ‌మే రోబో సెట్స్‌ కెళ్ల‌నుంద‌ని స‌మాచారం. అంత‌వ‌ర‌కూ రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ వ‌స్తూనే ఉంటుంద‌న్న‌మాట‌!