Begin typing your search above and press return to search.

ఆలీతో బ్రేక్ కోసం భామ స్కెచ్

By:  Tupaki Desk   |   31 Aug 2016 6:36 AM GMT
ఆలీతో బ్రేక్ కోసం భామ స్కెచ్
X
బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ ఇప్పుడు బోలెడంత బిజీ. కేరక్టర్ల ఎంపిక విషయంలో ఈ భామ ట్యాలెంట్ చూసి అందరూ ఆశ్యర్యపోతుంటారు. పైగా ఈ పాపకి యాక్టింగ్ విషయంలో ట్యాలెంట్ బాగా ఎక్కువ. ఎక్స్ పోజింగ్.. స్కిన్ షో లాంటి సంగతుల్లో అయితే ఈ డోస్ మరీ ఎక్కువ. అందుకే ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు వరుసపెట్టి వచ్చేస్తుంటాయి. అయితే.. ఇదంతా సౌత్ కి మాత్రమే పరిమితం. ఇప్పటివరకూ బాలీవుడ్ లో ఈ భామ ప్రూవ్ చేసుకున్నదేమీ లేదు.

అప్పుడెప్పుడో కెరీర్ మొదట్లో చేసిన ఏక్ దివానా థా మహా ఫ్లాప్. గతేడాది సింగ్ ఈజ్ బ్లింగ్ అంతో ఇంతో ఆడినా.. అమీకి ఒరిగిందేమీ లేదు. అందుకే ఇప్పుడు నవాజుద్దీన్ సిద్దిఖీతో చేసిన ఫ్రీకీ ఆలీపై కన్నేసింది అమీ జాక్సన్. అసలే తని పర్ఫెక్ట్ బికినీ బాడీ అంటూ ప్రచారం చేసుకుని మరీ అట్రాక్ట్ చేసే ఈ భామ.. అందుకు తగ్గట్లుగానే ఒంపుసొంపులను చూపించుకుంటూ ప్రమోషన్స్ చేసేస్తోంది. సెప్టెంబర్ 9న విడుదల కానున్న ఈ మూవీపై అంచనాలు బాగానే ఉండడంతో.. ఫ్రీకీ ఆలీతో తన కెరీర్ కి బ్రేక్ సంపాదించాలన్నది అమ్మడి ఐడియా.

అందుకే ఓ సారి క్లీవేజ్ షో.. మరోసారి ఒంపుల సౌందర్యాన్ని ఆరబోస్తూ ప్రచారం చేస్తోంది.. పబ్లిసిటీ ఈవెంట్స్ లో అమీ పాల్గొంటోంది. మరి ఫ్రీకీ ఆలీ అయనా.. అమీకి బ్రేక్ ఇస్తాడో లేదో తెలియాలంటే మాత్ర మరో పది రోజులు ఆగాల్సిందే.