సొంతూళ్లో రోబో భామ వ్యాపారం

Fri Apr 21 2017 13:38:47 GMT+0530 (IST)

బాలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్.. ఇండియాలో టాప్ హీరోయిన్ రేంజ్ దిశగా దూసుకుపోతోంది. యాక్టింగ్ స్కిల్స్.. ఎక్స్ పోజింగ్ ట్యాలెంట్ ఫుల్లుగా ఉండడంతో.. అమ్మడి చేతికి అందే ప్రాజెక్టులన్నీ క్రేజీవే అవుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే తన కెరీర్ ని తీర్చిదిద్దుకుంటున్న ఈ భామ.. వ్యాపారానికి వచ్చేసరికి సొంతూళ్లో చేసుకుంటానంటోంది.

ఇండియాలో క్రేజ్ సంపాదించినా.. అమీ జాక్సన్ బ్రిటిన్ నుంచి ఇక్కడికి వచ్చిన సుందరాంగే. అందుకే..  ఆంట్రప్రెన్యూర్ గా మారాలన్న తన చిన్నప్పటి కోరికను ఇప్పుడు అక్కడే ప్లాన్ చేసుకుంటోంది. రెస్టారెంట్ వ్యాపారం ప్రారంభిస్తున్న అమీ జాక్సన్.. ఇందుకు లండన్ ను ఎంచుకుంది. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి తన మమ్మీ మార్గరీటాతో కలిసి లండన్ లో ఓ రెస్టారెంట్ ను ఓపెన్ చేస్తోంది రోబో సీక్వెల్ 2.0 భామ అమీ జాక్సన్.

'ఆంట్రప్రెన్యూర్ గా మారాలన్న కోరిక నాకు ఎప్పటి నుంచో ఉంది. కొత్త రెస్టారెంట్స్.. మల్టీ క్యూజిన్స్ ను విజిట్ చేయడం నా హాబీ. అదే హాస్పిటాలిటీ రంగంలో నా అదృష్టం పరీక్షించుకుందామని అనుకుంటున్నా. నాకు తిండి అంటే ఉన్న ఇష్టమే.. ఇలా రెస్టారెంట్ ప్రారంభానికి దారి తీస్తోంది' అని చెప్పింది అమీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/