ఫోటో స్టోరి: అందమే ఒక మాయ

Thu Jan 18 2018 21:00:01 GMT+0530 (IST)

ఇటు సౌత్ ఇండియన్ - అటు నార్త్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలను కవర్ చేస్తోన్న హాట్ బ్యూటీ అమీ జాక్సన్. పరదేశం మోడల్ అయినా సరే అమ్మడు ఎక్కడ ఎలా నటించాలో బాగా తెలుసుకుంది. అవసరం అయితే ఏ స్థాయిలో అయినా అందాలను అరబోయడానికి రెడీగా ఉంటుంది. అంతే కాకుండా ఇండియన్ ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది అంటే చాలు బ్రిటిష్ బ్యూటీ అంటే ఎవరు నమ్మరు.ఇక అమీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు వినూత్నమైన లుక్స్ లో కనిపించి షాక్ ఇస్తోంది. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఒక స్టిల్ ని చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. టాప్ అందాలను చాలా సెక్సీగా చూపించేసింది. మొన్నటి వరకు బికినిలో కనిపించినా కూడా అమీ ఇంత అందంగా కనిపించలేదు గాని ఇప్పుడు మాత్రం చాలా సెక్సీగా ఉందని ఆమె ఫాలోవర్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. సింపుల్ గా ఒక కోట్ ధరించి క్లివెజ్ షోతో కుర్రకారుకు ఒక్కసారిగా తన అందం మాయని చూపించింది. దీంతో ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టుగా ఘాటైన కామెంట్స్ తో పొగిడేస్తున్నారు.

అంతే కాకుండా ఆమె చూపుల్లో కూడా ఒక మ్యాజిక్ ఉందని మొత్తంగా అమీ అందమే ఒక మాయ అంటున్నారు. అమీ జాక్సన్ రజినీకాంత్ 2.0 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ఎప్రిల్ లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం అమీ హాలీవుడ్ లో ఒక టీవీ సిరీస్ లో నటిస్తోంది. అలాగే కన్నడలో కూడా ఒక సినిమాతో బిజీగా వుంది.