Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: హాట్నెస్ పెంచేసి ఐస్ తింటోంది

By:  Tupaki Desk   |   15 July 2018 6:34 AM GMT
ఫోటో స్టోరీ: హాట్నెస్ పెంచేసి ఐస్ తింటోంది
X
బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ ఏం చేసినా సంచలనమే. సోషల్ మీడియాలో ఆమె చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇండియాలో చేసిన సినిమాలు తక్కువే కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. హాట్ హాట్ ఫొటో షూట్లతో కుర్రాళ్ల టెంపరేచర్లు రైజ్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫొటో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. స్విమ్మింగ్ పూల్ ఒడ్డున కూర్చుని బికినీలో అందాలు ఆరబోస్తూ.. హీట్ పెంచేస్తున్న అమీ.. తను మాత్రం కూల్ గా ఐస్ తింటూ కూర్చుంది. ఆమె అంత కూల్ గా కనిపిస్తోంది కానీ.. ఈ ఫొటో చూసిన కుర్రాళ్లు మాత్రం కుదురుగా ఉండటం కష్టమే.

సోషల్ మీడియాలో తరచుగా ఇలా కుర్రాళ్లకు కానుకలు ఇవ్వడం అమీకి మామూలే. కాకపోతే ఇంత అందం.. ఆకర్షణ.. బోల్డ్ నెస్ ఉండి కూడా అమీ ఆశించిన స్థాయిలో సినిమాలు చేయకపోవడం.. వెండి తెరపై ఆమె అందాల్ని చూసే అవకాశం పెద్దగా లేకపోతుండటమే విచారకరం. ‘ఐ’ సినిమాతో ఆమె కెరీర్ మారిపోతుందనుకున్నారు కానీ.. అలాంటిదేమీ జరగలేదు. దాని తర్వాత శంకర్ ‘2.0’ లాంటి మెగా ప్రాజెక్టులో ఛాన్స్ ఇచ్చాడు కానీ.. అది ఎంతకీ విడుదల కావట్లేదు. నవంబరు 29 అంటూ కొత్త డేట్ ఇచ్చిన శంకర్.. ఆ రోజుకైనా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తే.. ఆ తర్వాతైనా అమీ కెరీర్ మారుతుందేమో చూడాలి.