Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: మత్తెక్కిస్తున్న అమీజాక్సన్

By:  Tupaki Desk   |   14 July 2018 10:01 AM GMT
ఫోటో స్టోరీ: మత్తెక్కిస్తున్న అమీజాక్సన్
X

శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’ మూవీ ద్వారా మెరిసిన అమీ జాక్సన్ ఆ తర్వాత బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలోనే రజినీ హీరోగా రూపొందుతున్న ‘2.0’లో హీరోయిన్ గా చేస్తోంది. లండన్ నుంచి దిగుమతి అయిన ఈ హాట్ బ్యూటీ సినిమాల్లోనే కాదు బయటా కూడా హాటే అని నిరూపించింది.

సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్ తో అమీజాక్సన్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.. బికినీ - స్విమ్ - ట్రాన్సపరేంట్ ఇలా రకరకాల దుస్తులు వేసుకొని తన అందచందాలను ఏమాత్రం దాచుకోకుండా అభిమానులకు కన్నుల విందు చేస్తోంది. అమీ ఇన్ స్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేస్తే ఎన్నో రోమాంటిక్ ఫొటోలు దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో 5 లక్షల ఫాలోవర్స్ ను ఈ బ్యూటీ సొంతం చేసుకుంది.

తాజాగా అమీజాక్సన్ విడుదల చేసిన ఫొటోను చూసి కుర్రాళ్లు సొల్లు కారుస్తున్నారు.. వైట్ టాప్ ధరించి సోఫాలో కూర్చున్న స్టైలిష్ హాట్ పిక్ అందరినీ షేక్ చేస్తోంది. పైన మొత్తం కనిపించేలా షేర్ చేసిన ఈ లండన్ భామ ముందు ముందు మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి..