ఫొటోస్టోరీ: అందంతో పంజా విసిరిందిలా!

Thu Jul 12 2018 13:57:39 GMT+0530 (IST)

పులి... సింహం.. చిరుతలే  కాదు  అందం కూడా పంజా విసురుతుంది. కుర్రాళ్ల మనసులపై తీయటి గాయాలు  చేసేస్తుంది.  కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.  ఆ విషయాన్ని తాజాగా మరోమారు రుజువు చేసింది అమీజాక్సన్.   ఈ ఇంగ్లిష్ భామ ఇండియాలోనే స్థిరపడిపోయింది. దక్షిణాది చిత్రాలతో పాటు...  బాలీవుడ్‌లోనూ నటిస్తూ  మురిపిస్తోంది. అందాల ప్రదర్శనలో ఏమాత్రం మొహమాటం లేదని చాటుతూ ఎప్పుడు పడితే అప్పుడు టు పీస్ డ్రెస్సులతో హాట్ హాట్ పోజులు ఇస్తుంటుంది అమీ. ఈ భామ పోజులు కెమెరాలకి పండగ అని చెప్పొచ్చు.తాజాగా టైగర్ కాన్సెప్ట్‌తో డిజైన్ అయిన దుస్తుల్ని ధరించి - బెడ్‌పై పడుకొని హాట్ హాట్ పోజులిచ్చింది. నా మూడ్ ఛేంజ్ అయిందంటూ ఆ ఫొటోల్ని ఆన్ లైన్ లో పెట్టేసింది. ఆమె మూడ్ ఛేంజ్ అవ్వడమేంటో కానీ... ఆ హాట్ హాట్ పోజుల్ని చూస్తే మాత్రం కుర్రాళ్ల మూడ్ ఛేంజ్ కావడం ఖాయం. కావాలంటే మీరూ ఇక్కడ అమీని చూసి మూడ్ ఛేంజ్ చేసుకోండి కాసేపు!