Begin typing your search above and press return to search.

కౌగిట్లో ఉన్నది ఎవరు అమీ?

By:  Tupaki Desk   |   14 Jan 2018 6:30 AM GMT
కౌగిట్లో ఉన్నది ఎవరు అమీ?
X
తెలుగులో రామ్ చరణ్ తో ఎవడు సినిమా చేసినా పెద్దగా గుర్తింపు రాని రెడ్ టోన్ బ్యూటీ ఆమీ జాక్షన్ తమిళ్ లో బాగానే వర్క్ అవుట్ చేసుకుంటోంది. విక్రంతో చేసిన 'ఐ' ఫ్లాప్ అయినప్పటికీ మళ్ళి శంకర్ దర్శకత్వంలోనే ఏకంగా సూపర్ స్టార్ రజనికాంత్ పక్కన 2.0 లో ఛాన్స్ కొట్టేసిన అమీ దాని విడుదల కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది. అది కనక బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇక తనను పట్టేవాళ్ళు ఉండరు అనేది తన నమ్మకం. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఎప్పుడూ లైం లైట్ లో ఉండే అమీ జాక్సన్ తన సోషల్ మీడియా ఎకౌంటు లో షేర్ చేసుకున్న ఒక పిక్ వైరల్ కావడమే కాదు పలు రకాల అనుమానాలు కూడా రేకెత్తిస్తోంది. ఇందులో అమీ జాక్సన్ ఎవరినో కౌగిలించుకున్నట్టు ఒకటి, బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నట్టు మరొకటి ఉంది. కాని ఫోటో చాలా తెలివిగా అక్కడ ఉన్నది ఎవరో గుర్తించకుండా తీయడంతో ఫాన్స్ కి అది ఎవరా అని అర్థం కావడం లేదు.

ఇప్పటికే దీని మీద రకరకాల కామెంట్స్ మొదలయ్యాయి. షేర్ చేసుకోవాలి అని అనిపించినప్పుడు ధైర్యంగా అక్కడ ఉన్నది ఎవరో చూపించాలని అంతే తప్ప ఇలా దాగుడుమూతలు ఆడటం ఏమిటని అడుగుతున్నారు. కొందరు అక్కడ అమీ కౌగిలించుకుంది, ముద్దు పెట్టుకుంది అమ్మాయి అని గెస్ చేస్తుండగా, మరికొందరు మాత్రం అమీ ఎప్పటి నుంచో లవ్ లో ఉంది అని ప్రచారంలో ఉన్న సెబాస్టియన్ అనే డిజే అని అంటున్నారు. నిజానిజాలు అమీ చెప్తే కాని బయటికి రావు. తను అబ్బాయో, అమ్మాయో చెప్పేసి ఈ కన్ఫ్యూజన్ కి అమీ చెక్ పెట్టేస్తే బెటర్.  ఏవైనా హాట్ ఫొటోస్ షేర్ చేసుకుంటే ఎంజాయ్ చేస్తాం కాని ఇలా మొహం కనిపించని వాళ్ళతో ముద్దు పెట్టుకుంటే మాకొచ్చే కిక్ ఏంటి అని అడుగుతున్న అభిమానులు కూడా లేకపోలేదు. ఇంకేదైనా కొత్త ఫోటో పోస్ట్ చేసి అందులో అయినా డీటెయిల్స్ బయట పెడుతుందేమో అని ఎదురు చూడటం తప్ప ఎవరైనా చేయగలిగింది ఏమి లేదు.