Begin typing your search above and press return to search.

శంక‌ర్ హీరోయిన్ల‌లో ల‌క్కీ పిల్ల‌

By:  Tupaki Desk   |   4 Sep 2015 6:19 PM GMT
శంక‌ర్ హీరోయిన్ల‌లో ల‌క్కీ పిల్ల‌
X
స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన హీరోయిన్ల‌కు భ‌విష్య‌త్ అంత‌గా ఉండ‌ద‌ని ఓ రూమ‌ర్‌. అయితే దీనికి ప్రూఫ్‌ లు కూడా క‌ళ్ల‌ముందే ఉన్నాయి. అప‌రిచితుడు సినిమాలో న‌టించిన స‌దా, శివాజీ సినిమాలో న‌టించిన శ్రీ‌య‌, స్నేహితుడులో చేసిన ఇలియానా వీళ్లంతా ఇక ప‌రిశ్ర‌మ‌లో క‌నిపించిందే లేదు. కోలీవుడ్‌లో ఎప్ప‌టికీ స్టార్ హీరోయిన్ రేంజుకు ఎద‌గ‌లేక‌పోయారు వీళ్లంతా. ఒక త్రిష‌, ఒక కాజ‌ల్ రేంజుకి అయినా వీళ్లు క్రేజు తెచ్చుకోలేక‌పోయారు. కెరీర్ సాగినంత కాలం కేవ‌లం చిన్నా చిత‌కా క్యారెక్ట‌ర్ల‌తోనే స‌రిపుచ్చుకోవాల్సొచ్చింది.

సుదీర్ఘ కాలం షూటింగులు, త‌మ వైపు వ‌చ్చిన అవ‌కాశాల్ని అందిపుచ్చుకోలేనంత బిజీ షెడ్యూల్స్ శంక‌ర్‌ తో ప‌నిచేసే హీరోయిన్ల‌కు ఎదుర‌వుతుంది. అందుకే స్టార్ హీరోయిన్‌లెవ‌రూ అత‌డి సినిమాల‌లో న‌టించ‌రు. ద్వితీయ శ్రేణి నాయిక‌లకు మాత్ర‌మే ఆ అవ‌కాశం ద‌క్కుతుంది అందుకే. అయితే వీళ్లంద‌రి నుంచి లండ‌న్ బ్యూటీ ఎమీ జాక్స‌న్‌ని మిన‌హాయించాల్సిందే. ఈ భామ రెండేళ్ల పాటు సుదీర్ఘంగా కాల్షీట్లు ఇచ్చి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఐ సినిమాలో న‌టించింది. ఆ సినిమా ఎమీకి మంచి గుర్తింపు తెచ్చింది. అద్భుత‌మైన విజువ‌ల్ గ్రాఫిక్స్‌ లో ఎమీని టాప్ మోడ‌ల్‌ గా చూపించాడు శంక‌ర్‌. అది త‌న కెరీర్‌ కి మ‌రింత మైలేజ్‌ ని ఇచ్చింది.

ఎక్క‌డో లండ‌న్‌ లో పుట్టి కోలీవుడ్‌ ని ఏల్తోందిప్పుడు. ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో న‌టించేస్తూనే, అప్‌ క‌మింగ్ హీరోల సర‌స‌న నాయిక‌గా న‌టించేస్తోంది. అజిత్‌, సూర్య‌, ధ‌నుష్‌, విశాల్‌.. ఇంత‌మంది లైన్‌లో ఉన్నారు. తాజాగా శివ‌ కార్తికేయ‌న్ స‌ర‌స‌న ఓ సినిమాకి సంత‌కం చేసింది. దీనికి పీసీ శ్రీ‌రామ్‌, అనిరుధ్ వంటి ట్యాలెంటెడ్ పీపుల్ ప‌నిచేస్తున్నారు. ఎమీ ల‌క్కీ పిల్ల‌ కదండీ మరి.