అమీతో బ్రిటన్ బిజినెస్ మ్యాన్ డేటింగ్?

Sun Feb 18 2018 11:25:09 GMT+0530 (IST)

కోలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ లలో హాట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అమీ జాక్సన్ సినిమా షూటింగ్ లతో బిజీబిజీగా గడిపేస్తోంది. అయితే షూటింగ్ ల మధ్య దొరికిన కొద్దిపాటి విరామాన్ని ఈ హాట్ బ్యూటీ చక్కగా యుటిలైజ్ చేసుకుంటోంది. ఆ సమయంలో  ఈ అమ్మడు తన ఫ్రెండ్స్....కాదు కాదు బాయ్ ఫ్రెండ్స్ తో విదేశాల్లో చక్కర్లు కొడుతోందనే పుకార్లు వినిపిస్తున్నాయి. తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫొటోలు ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన అమీ...అందరు హీరోయిన్ల మాదిరిగానే ....అతడు తన ఫ్రెండ్ అని బుకాయించేస్తుంది. అయితే ముంబైకు చెందిన ఓ ప్రముఖ పత్రిక మాత్రం....అమీ...జార్జ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారితో పీకల్లోతు ప్రేమలో ఉందని ఓ కథనం రాసింది. అంతేకాదు వేలంటైన్ డే సందర్భంగా ఈ జంట వారం రోజుల పాటు కెనడాలోని బ్లాక్ కోంబ్ లో గడిపారట. అక్కడి మంచులో స్కీయింగ్ చేస్తోన్న ఫొటోలను అమీ పోస్ట్ చేసింది.లండన్ లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి జార్జ్ పనయివోటుతో అమీ డేటింగ్ చేస్తోందని పుకార్లు వినిపిస్తున్నాయి. మొదట్లో జార్జ్ అమీలను ఫ్రెండ్స్ అనుకున్నారు. కానీ పదే పదే జార్జ్ - అమీలు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండడంతో అతడే అమీ బాయ్ ఫ్రెండ్ అని కన్ ఫర్మ్ చేస్తున్నారు. వేలంటైన్ డే సెలబ్రేషన్స్ కూడా జార్జ్ తోనే జరుపుకోవడంతో ఆ అనుమానాలు బలపడ్డాయి.కెనడా టూర్ సందర్భంగా అమీ - జార్జ్ లు ఓ రిసార్ట్ లో మూడు రోజుల పాటు ఉన్నారట. బడా వ్యాపారవేత్త అయిన జార్జ్ కు యూరప్ లో చాలా హోటల్స్ కూడా ఉన్నాయట. త్వరలోనే జార్జ్ తో .అమీ పెళ్లి వార్త విన్నా ఆశ్చర్యపోనవసరం లేదని  బీ టౌన్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.