Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: చెల్లిని బ‌రిలో దించుతోంది

By:  Tupaki Desk   |   9 Feb 2019 4:55 AM GMT
ఫోటో స్టోరి: చెల్లిని బ‌రిలో దించుతోంది
X
లండ‌న్ టు ఇండియ‌న్ ఫిలింఇండ‌స్ట్రీ ఎమీజాక్స‌న్ ప‌య‌నం గురించి తెలిసిందే. బాలీవుడ్ - కోలీవుడ్ - టాలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు ఈ అమ్మ‌డు సుప‌రిచితం. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఐ - 2.0 చిత్రాల‌తో ఈ బ్రిటీష్ బ్యూటీ పాపులారిటీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అసాధార‌ణంగా పెరిగింది. మ‌ద‌రాసి ప‌ట్ట‌ణం - ఎవ‌డు చిత్రాల‌తో సౌత్ లోనూ చ‌క్క‌ని క్రేజు తెచ్చుకుంది. వీటికి తోడు హాలీవుడ్ లో ప‌లు టీవీ సిరీస్ ల‌లో న‌టించి ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. ప్ర‌స్తుతం ప్ర‌ఖ్యాత హాలీవుడ్ నిర్మాణ సంస్థ‌లు ఎమీజాక్స‌న్ ని సూప‌ర్ ఉమెన్ గా చూపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి.

అదంతా అటుంచితే.. ఎమీజాక్స‌న్ ఈ కొత్త ఏడాదిలో పెళ్లి క‌బురు చెప్ప‌బోతోంద‌ని వార్త‌లొస్తున్నాయి. బ్రిట‌న్ బిలియ‌నీర్ జార్జి పాన‌య‌ట్టుతో నిశ్చితార్థానికి స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని ఇదివ‌రకూ ఓ క్లూ ఇచ్చింది. ప్ర‌స్తుతం అత‌డితో స‌హ‌జీవ‌నంలో ఉన్న ఈ బ్యూటీ వీలున్న ప్ర‌తి సంద‌ర్భంలో ఒంట‌రి దీవుల‌కు షికార్లు వెళుతోంది. ఎమీ జాక్స‌న్ నుంచి తాజాగా మ‌రో హాట్ అప్ డేట్ అందింది.

2019లో త‌న సిస్ట‌ర్ ఇన్‌ హ‌రాను వెండితెర క‌థానాయిక‌గా ప‌రిచ‌యం చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఇహ‌నాతో ఎమీ హ్యాపీ మూడ్ లో ఉన్న‌ప్ప‌టి ఓ ఫోటోని ఇన్ స్టాగ్ర‌మ్‌ లో షేర్ చేసిన ఎమీజాక్స‌న్ దానికి ఆస‌క్తిక‌ర‌మైన ట్యాగ్ ని ఇచ్చింది. ``హ్యాపీ బ‌ర్త్ డే టు మై బ్యూటిఫుల్ ఆక్వేరియ‌న్ వైఫీ ఇన్హారా. నువ్వు ఎప్పుడూ నా వెంటే ఉన్నావు. ఎప్ప‌టికీ నిన్ను ఇలానే ప్రేమిస్తాను మై బేబి గాళ్. ఈ సంవ‌త్స‌రం నీకు ఇంకా అద్భుత‌మైన జ్ఞాప‌కాల్ని పంచుతాను.. అంటూ స్టార్ సింబ‌ల్ ఈమోజీల్ని షేర్ చేసింది. అంటే త‌న సిస్ట‌ర్ ని స్టార్ ని చేస్తాననేదే ఎమీజాక్స‌న్ ఉద్ధేశం కావొచ్చు. మొత్తానికి ఎమీజాక్స‌న్ 2 బ‌రిలో దిగుతోంద‌న్న‌మాట‌!! వెల్ కం టు హాట్ గాళ్.. బాలీవుడ్ - కోలీవుడ్ - టాలీవుడ్ వెయిటింగ్ ఇక్క‌డ‌!!