బటన్ లెస్ లో టూమచ్ హాటీ

Sat Aug 11 2018 12:07:06 GMT+0530 (IST)

ప్రపంచ దేశాల్లో ఎమీ జాక్సన్ పాపులారిటీ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఓవైపు ఇండియాలో - మరోవైపు పాశ్చాత్య దేశాల్లో ఈ టాప్ మోడల్ కం నటి హవా సాగుతోంది. విదేశీ టీవీ సిరీస్ లో సూపర్ గాళ్ పాత్రలో నటించాక ఆ క్రేజు మరింతగా పెరిగిందనే చెప్పాలి. ఇటీవలే ప్రఖ్యాత డీసీ కామిక్స్ సంస్థ ఎమీజాక్సన్ సూపర్ గాళ్ స్టింట్ ని పెద్దతెరకు తీసుకెళ్లే ఛాన్సుందని ప్రకటించాక ఆ క్రేజు ఇంకా రెట్టింపైంది. అంటే ఎమీ పూర్తి స్థాయి సూపర్ గాళ్ పాత్రలో నటించే ఆస్కారం ఉంది. సూపర్ మేన్ తరహాలోనే సూపర్ ఉమెన్ గా అవతరించబోతోంది అన్న వార్తతో ఈ హాట్ గాళ్ పేరు మరింతగా మార్మోగిపోతోంది.పాపులారిటీకి తగ్గట్టే ఎమీజాక్సన్ ప్రఖ్యాత బ్రాండ్లకు ప్రచారం చేస్తూ ఉరకలెత్తిస్తోంది. ఇదిగో ఇక్కడ బ్లూడెనిమ్ లో వేడెక్కించే ఫోజులతో మతిచెడగొడుతోంది. ఇదంతా ఆ చెప్పుల కంపెనీ ప్రచారం కోసమేనని అనుకుంటే అంతకుమించి డెనిమ్ కంపెనీకి పేరొస్తోంది. బ్లూడెనిమ్ లోనూ టూపీస్ ని పరిచయం చేసిన ఘనత తనదేననిపించింది ఈ ఫోటోలో. ముఖ్యంగా ఆ టాప్‌కి బటన్ పెట్టకుండా గాలికొదిలేసి కుర్రకారు గుండెల్లో స్పీడోమీటర్ ని పరుగులెత్తించింది. గుబులు రేపే ఆ థైస్ కి జానా బెత్తెడు నిక్కరు మాత్రమే అడ్డంకిగా మారింది. తాను ప్రచారం చేస్తున్న ఆ చెప్పుల కంటే టాప్ టు బాటమ్ డెనిమ్ కే ఎక్కువ ప్రచారం దక్కుతోందిలా.

ఎమీ నటించిన 2.ఓ నవంబర్ 29న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వేడెక్కించే రోబోటిక్ విన్యాసాలతో  ఆకట్టుకోనుంది. బ్రిటన్ బోయ్ ఫ్రెండ్ జార్జి పనాయటౌతో షికార్లు - పెళ్లి అన్న వార్తల నడుమ .. ఎమీజాక్సన్ కొత్త హైట్స్ ని టచ్ చేస్తోంది. తన లెవల్ ని అంతకంతకు పెంచుకుంటూ వెళుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడి సీన్ చూస్తుంటే ఇంకే రేంజును టచ్ చేస్తుందోనన్న ఆసక్తికర చర్చ సాగుతోంది.