సూటులోన సోకిల్ల సంపేత్తోందిర!

Mon Dec 10 2018 22:25:14 GMT+0530 (IST)

సూటులోన సోకిల్ల సంపేత్తోందిగ.. సందట్లో సడేమియాలా గుంజేత్తోందిర!! ఇక్కడ కనిపిస్తున్న సోకిల్ల ఎవరో పరిచయం చేయాల్సిన  అవసరమే లేదు! కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టిన ఈ లండన్ బ్యూటీ ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఏ ఒంటరి దీవిలోనో .. బీచ్ రిసార్టులోనే బోయ్‌ఫ్రెండ్‌తో కలిసి సేద దీరుతూ ఉందో లేక ఇంకేదైనా హాలీవుడ్ ప్రాజెక్టు గురించి డిస్కషన్‌లో ఉందో కానీ.. ఈ వాలకం చూస్తుంటే మరోమారు ఫోటోషూట్లతో విరుచుకుపడుతున్నట్టే కనిపిస్తోంది.సూట్‌లో కనిపించినా సింపి ఆరేయడం ఈవిడకు తెలిసినంతగా వేరొకరికి తెలీదేమో. అంతగా చించేస్తోందిలా.. ఫక్తు కార్పొరెట్ అమ్మణ్ణిలా కనిపించిన ఎమీజాక్సన్ సూటు మాటున దాగిన అందాల్ని ఎరవేస్తూ రెచ్చగొట్టేస్తోందిలా. అందం హిందోళం.. అదరం తాంబూళం అంటూ వేటూరి అంతటివారే మరో మారు కలం పట్టి సమాధి నుంచి నిదుర లేస్తారేమో!

ఈ మధ్యనే 2.ఓ చిత్రంలో తళుక్కుమంది.  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 500కోట్ల నుంచి 600 కోట్ల గ్రాస్ మార్కును చేరుకుంది అంటూ ప్రచారం సాగుతోంది. అయితే ఆ క్రెడిట్ అంతా శంకర్ - రజనీ ఖాతాలోకే వెళ్లిపోయింది కానీ ఇసుమంత కూడా తనకు దక్కలేదు. శంకర్ ఆ సినిమాలో తనకు అంతగా ప్రాధాన్యత లేని పాత్రను ఇచ్చాడన్న కోపంతో కనీసం ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనేందుకు ఈ అమ్మడు రానేలేదని అందరికీ అర్థమైంది. మొత్తానికి సినిమా పూర్తి చేసి ఆ తర్వాత ప్రాజెక్టు గురించి సీరియస్ గానే ప్లాన్స్‌లో ఉంది ఎమీ అని భావించవచ్చు. అన్నట్టు హాలీవుడ్ లో డీసీ కామిక్స్‌లో సూపర్ ఉమెన్ సిరీస్ లో నటిస్తుందని అప్పట్లో ప్రచారమైంది. దానికి సంబంధించిన అప్‌డేట్ రాలేదింకా.