Begin typing your search above and press return to search.

​ఆరు గంటలకు అమ్మడికి కోటి

By:  Tupaki Desk   |   18 Aug 2017 10:06 AM GMT
​ఆరు గంటలకు అమ్మడికి కోటి
X
ఆమీ జాక్సన్ అంటే తెలియని యూత్ ఇప్పుడు లేరంటే పెద్దగా మనం ఆశ్చర్యపడే పనిలేదు. ఎందుకంటే ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా ఆమె ఫోటో షూట్లు మాత్రం లెక్కపెట్టలేనన్ని చేసింది. చేసిన ఫోటో షూట్లు మళ్ళీ మామూలుగా ఉంటాయి అనుకుంటే మీరు పొరపడినట్లే. ఆమె బికినీ ఫోటో షూట్లు బీచ్ లో విహారాలు కొత్త కొత్త ఫ్యాషన్ వస్త్రాల్లో తన సోయగాలును చూపిస్తూ ఇంటర్నెట్లో ఎప్పటికప్పుడు వేడిని పెంచుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే ఒక హాట్ ఫోటో షూట్ తో కాకపోయినా ఆమె అడిగిన పారితోషకంతో హాట్ న్యూస్ గా మారింది.

ఎవరైనా ఒక సినిమాకు కొన్ని కోట్లు అడు​గు​తారు లేకపోతే ఒక బ్రాండ్ ఎండార్స్ మెంట్ చేయడానికి ఒక ఏడాది ఒప్పందానికి కోట్లు అడుగుతారు. కానీ ఇక్కడ బ్రిటీష్ సుందరి ఆమీ జాక్సన్ కాబట్టి.. ఒక్క కాల్షీట్ కోసం ఒక కోటి అడిగిందిట. ఒక కార్పొరేట్ కంపెనీ తన ప్రాడక్ట్ బ్రాండింగ్ కోసం ఓ ఆరు గంటలు కాల్షీట్ అడిగితే 2.0 హీరోయిన్ ఆమీ జాక్సన్ ఆలోచనే లేకుండా ఒక కోటి ఇస్తే చేస్తా లేకుంటే లేదు అని చెప్పేసిందట. దానితో ఆ కంపెనీ వాళ్ళకి విశ్వం మొత్తం కళ్ళ ముందు కనిపించేసింది. అసలు వాళ్ళ బడ్జెట్ 3 కోట్లు అయితే.. ఇప్పుడు ఆమీ జాక్సన్ కోటి అడగటంతో మరో కోటి ఎక్స్ ట్రా భరించవలిసి వచ్చింది.

ప్రస్తుతం బూగీ మాన్ అనే ఇంగ్లిష్ సినిమాలో నటిస్తున్న ఆమీ.. దానితో పాటు మన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ 2.0 సినిమా కూడా చేస్తోంది. సినిమాలు పెద్దగా చేతిలో లేని కారణంగా ఈ విదంగా రేట్ ఒక్కసారిగా పెంచేసింది అని చెబుతున్నారు కొంతమంది యాడ్ ఏజన్సీ వాళ్ళు. అదేమీ కాదు పని బట్టే రేటు ఉంటుంది అని చెబుతున్నారు ఈ హీరోయిన్ పిఆర్ టీమ్. అది సంగతి.