Begin typing your search above and press return to search.

కొబ్బ‌రికాయ టాపిక్‌ తో మ‌రో హీరోయిన్‌

By:  Tupaki Desk   |   27 July 2017 12:54 PM GMT
కొబ్బ‌రికాయ టాపిక్‌ తో మ‌రో హీరోయిన్‌
X
హీరోయిన్ తాప్సి తీసుకొచ్చిన కొబ్బ‌రికాయ ప్ర‌స్తావ‌న టాలీవుడ్‌లో చ‌ర్చ‌ని లేవ‌నెత్తిన విష‌యం తెలిసిందే. అయితే ఆ విష‌యంపై తాప్సి ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చింది. తాను ఆ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన ఉద్దేశం, నేనక్క‌డ చెప్పిన విష‌యం వేరే అని చెప్పింది. అయినా కె.రాఘ‌వేంద్ర‌రావు అభిమానులు శాంతించ‌డం లేదు. తాప్సి అనుచితంగానే మాట్లాడింద‌ని, ఆమెది ముమ్మాటికీ త‌ప్ప‌ని... ఏరు దాటాక తెప్ప తగ‌లేసిన చందంలా ఆమె వ్య‌వ‌హారం ఉంద‌ని మండిప‌డుతున్నారు. రాఘవేంద్ర‌రావు తీసిన ఝుమ్మందినాదంలోని ఓ పాట‌లోనే తాప్సి బొడ్డుపై కొబ్బ‌రిచిప్ప విసిరే స‌న్నివేశం ఉంటుంది. అది తాప్సికి తొలి సినిమా అనే విష‌యం తెలిసిందే. కొద్దిమంది మాత్రం తాప్సి క్లారిటీతో శాంతించారు.

అయితే బాలీవుడ్ జ‌నాలు మాత్రం ఆ వ్య‌వ‌హారాన్ని ఇప్ప‌ట్లో వ‌దిలిపెట్టేలా క‌నిపించ‌డ‌డం లేదు. క‌థానాయిక‌లంద‌రినీ కొబ్బ‌రికాయ మీ బొడ్డుపై విసిరుతామంటే మీరెలా స్పందిస్తారని అక్కడి మీడియా జ‌నాలు అడుగుతున్నారు. దాంతో క‌థానాయిక‌లు ఒకొక్క‌రు ఒక్కోలా స్పందిస్తున్నారు. అమీజాక్స‌న్ అయితే కాసింత ఘాటుగానే స్పందించింది. ఓ ఆంగ్ల ప‌త్రిక‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ``ద‌ర్శ‌కులు నాపై కొబ్బ‌రికాయ విసిరితే నేను తిరిగి వాళ్ల మొహంపై విసురుతా. అది తెలిసే నాతో ఎవ్వ‌రూ అలా చేయ‌లేదేమో. అది ఎప్పుడూ జ‌ర‌గ‌కూడ‌ద‌ని కోరుకొంటున్నా`` అని వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్య‌ల‌పై కూడా చాలామంది విమ‌ర్శలు వ్య‌క్తం చేస్తున్నారు. ద‌ర్శ‌కుల‌పై అలా కామెంట్ చేయ‌డం త‌ప్ప‌ని అంటున్నారు. మ‌రి అమీ ఏం చెబుతుందో చూడాలి.