అమ్రపాలి పెళ్లి కూతురైంది

Sun Feb 18 2018 10:50:24 GMT+0530 (IST)

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ లు ఎంతమంది ఉన్నా.. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి సో స్పెషల్. మిగిలిన వారి మాదిరి కాకుండా తనదంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్లో వ్యవహరించే ఆమె మాట.. చేతలు వార్తల్లో నిలుస్తుంటాయి. వివాదాల్ని పట్టించుకోకుండా తానేం చేయాలంటే అది చేసేసే ఆమె తీరు అందరిలో భిన్నమైన అధికారిణిగా నిలిపింది. ఈ రోజు ఆమె పెళ్లి.తాను ప్రేమించిన ఐపీఎస్ అధికారి సమీర్ శర్మను ఆమె పెళ్లి చేసుకోనున్నారు. మరికాసేపట్లో జమ్ములో సంప్రదాయబద్ధంగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇలాంటి వేళ.. తన సిస్టర్ తో కలిసి పెళ్లికూతురుగా ముస్తాబైన అమ్రపాలి ఒక సెల్ఫీ దిగారు.

ఎరుపురంగు పట్టుచీర.. మెడలో బంగారు గొలుసు.. తలపై పాపిట బిళ్లతో సంప్రదాయానికి నిలువెత్తు రూపంగా మారిన అమ్రపాలి.. తన సోదరితో కలిసి ఫోటో తీసేసుకొని పోస్ట్ చేశారు. పెళ్లికుమార్తెగా ఉన్న ఆమె ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.