Begin typing your search above and press return to search.

బచ్చన్ సార్.. మీకు మీరే సాటి

By:  Tupaki Desk   |   6 Feb 2016 10:30 PM GMT
బచ్చన్ సార్.. మీకు మీరే సాటి
X
మన అల్లు అర్జున్ ఫేస్ బుక్ లో కోటి లైక్స్ తో పెద్ద సెన్సేషనే క్రియేట్ చేశాడు. ఓ సౌత్ హీరో పేజీని కోటి మంది లైక్ చేయడమన్నది చిన్న విషయం కాదు. మన బన్నీ ఇలా రికార్డ్ క్రియేట్ చేసిన సమయంలోనే బాలీవుడ్ గ్రేట్ అమితాబ్ బచ్చన్ కూడా ఫేస్ బుక్‌ లో ఓ మైలురాయిని అందుకున్నాడు. ఆయన పేజీ లైక్స్ 23 మిలియన్ మార్కును దాటేశాయి. అంటే అక్షరాలా 2 కోట్ల 30 లక్షల మంది బిగ్-బిని అనుసరిస్తున్నారన్నమాట. యువ కథానాయకుల హవా సాగుతున్న ఈ రోజుల్లో 73 ఏళ్ల అమితాబ్ సోషల్ మీడియాలో ఈ స్థాయిలో ఆదరణ పొందుతుండటం చిన్న విషయం కాదు.

ఇండియాలో అత్యధిక లైక్స్ ఉన్న ఫేస్ బుక్ పేజీల్లో అమితాబ్ ది టాప్-10లో ఉండటం విశేషం. ఆయన ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 3.2 కోట్ల ఫాలోయర్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే 3.06 కోట్ల ఫాలోయర్లతో రెండో స్థానంలో ఉండటం విశేషం. సల్మాన్ ఖాన్ (2.944 కోట్లు), యోయో హనీ సింగ్ (2.941 కోట్లు), సచిన్ టెండూల్కర్ (2.6 కోట్లు), శ్రేయ ఘోషల్ (2.54 కోట్లు), విరాట్ కోహ్లి (2.37 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇండియన్ క్రికెట్ టీం పేజీ 2.35 మంది ఫాలోయర్లతో అమితాబ్ కంటే ముందు 8వ స్థానంలో ఉంది. ఐతే ఫేస్ బుక్ లో 9వ స్థానంలో ఉన్న బచ్చన్ సార్.. 1.92 కోట్ల మంది ఫాలోయర్లతో ఇండియా మొత్తంలో అగ్రస్థానంలో కొనసాగుతుండటం విశేషం.