Begin typing your search above and press return to search.

అమితాబ్ అలాంటి క్యారెక్టర్ చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   1 Oct 2016 1:30 PM GMT
అమితాబ్ అలాంటి క్యారెక్టర్ చేస్తున్నాడా?
X
హీరోగా ఉన్నప్పటి కంటే.. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ రోల్స్ చేయడం మొదలుపెట్టాక మరింత వైవిధ్యమైన పాత్రలు ఎంచుకున్నారు అమితాబ్ బచ్చన్. ‘బ్లాక్’ దగ్గర్నుంచి.. మొన్నటి ‘పింక్’ వరకు అమితాబ్ ఎంచుకున్న పాత్రలు ఆయన విలువను ఎంతో పెంచాయి. తాజాగా బిగ్-బి మరో సెన్సేషనల్ క్యారెక్టర్ చేయబోతున్నారు. ముంబయిలో డబ్బావాలాలు ఎంత ఫేమసో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ డబ్బావాలాలకు పెద్దగా ఆయన కనిపించబోతున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్‌.. ప్రదీప్‌ సర్కార్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘డబ్బాగుల్‌’ అనే సినిమాలో అమితాబ్ ఈ క్యారెక్టర్ చేయబోతున్నారు.

ముంబయిలో కొన్ని లక్షల మందికి మధ్యాహ్నం క్యారియర్లు సరఫరా చేస్తారు డబ్బావాలాలు. నెలకు ఇంత అని తీసుకుని.. మధ్యాహ్నం వచ్చి ఇంటినుంచి క్యారియర్ తీసుకుని వాళ్ల వాళ్ల ఆఫీసులకు వెళ్లి చేరుస్తారు. లక్షల క్యారియర్లు సరఫరా చేస్తున్నా.. మిస్సింగ్ అన్న మాటే ఉండదు. దేశవ్యాప్తంగా ముంబయి డబ్బావాలాలు ఫేమస్. అలాంటి వాళ్ల మీద సినిమా రాబోతుండటం విశేషమే. ఈ సినిమాలో అమితాబ్‌ తో బాటు వరుణ్‌ ధావన్‌ కూడా నటిస్తాడట. మున్నాభాయ్‌ సిరీస్ తరహా ఎంటర్టైన్మెంట్ ప్లస్ మెసేజ్ కలిపి ఈ సినిమా ఉంటుందట. విశేషం మరోవైపు అమితాబ్.. అమీర్ ఖాన్ తో కలిసి ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్తాన్‌’ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. ఆ చిత్రానికి ‘ధూమ్-3’ దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తాడు. అది కూడా యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లోనే తెరకెక్కుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/