Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కి ఈ ముగ్గురు బ్యూటీలు స్పెషల్

By:  Tupaki Desk   |   10 Feb 2016 1:30 PM GMT
మెగాస్టార్ కి ఈ ముగ్గురు బ్యూటీలు స్పెషల్
X

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ నెట్ వర్కింగ్ లోగా యాక్టివ్. బ్లాగుల ప్రారంభపు రోజుల నుంచే ఆయన ఆన్ లైన్ ద్వారా అందుబాటులోనే ఉంటున్నారు. తన ప్రతీ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అమితాబ్. తాజాగా తన కొడుకు అభిషేక్ బచ్చన్ పుట్టిన రోజును మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేశారు బచ్చన్ ఫ్యామిలీ అంతా.

అమితాబ్ - ఆయన భార్య జయాబచ్చన్ - కొడుకు అభిషేక్ - కోడలు ఐశ్వర్యారాయ్ - కూతురు శ్వేతా నందా - మనుమరాలు ఆరాధ్యలతో కలిసి మాల్దీవ్స్ ని చుట్టేశారు. ఆ ట్రిప్ కి సంబంధించి ఇప్పుడొక ఫోటో పోస్ట్ చేశారు బిగ్ బీ. ఐశ్వర్య - శ్వేత - ఆరాధ్యలు ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారాయన. ఓ స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉన్న బెడ్ పై ఈ ముగ్గురూ పక్కపక్కనే కూర్చున్న ఈ ఫోటో చాలా అంటా చాలా క్యూట్ గా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ ముగ్గురి ఫోటోతో పాటు తన మనసులో భావాన్ని కూడా ట్వీట్ చేశారు అమితాబ్.

'ఆర్చిడ్స్ చాలా అరుదు. వాటికి చాలా విలువ ఉంటుంది. అంత విలువైన ఈ ముగ్గురు బ్యూటీలు నా జీవితంలో ఉన్నారు. ఈ ముగ్గురు మహిళలో నా లైఫ్ లో చాలా స్పెషల్. ఇప్పటికీ, ఎప్పటికీ' అంటూ తన ఆనందాన్ని అభిమానులకు ట్వీట్ ద్వారా పంచారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్