Begin typing your search above and press return to search.

తిరిగిరాని మిత్రుడు కోసం అమితాబ్ ఉత్తరం

By:  Tupaki Desk   |   29 April 2017 12:30 AM GMT
తిరిగిరాని మిత్రుడు కోసం అమితాబ్ ఉత్తరం
X
బాలీవుడ్ గోల్డెన్ ఎరా (1970 కాలం)లో పొగురున్న అందగాడు నిండు మనసున్న సోగ్గాడు వినోద్ ఖన్నా నిన్న తుదిశ్వాస వదిలి స్నేహితులును సినీ అభిమానాలుకు దుఖ సాగరంలో మిగిల్చిపోయారు. తిరిగిరాని తీరానికి వెళ్ళిపోయారు. ఇకపోతే మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అండ్ వినోద్ ఖన్నాలు మంచి స్నేహితులు. అందుకే ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలును ఆలోచనలను బ్లాగ్ లో రాసే బిగ్ బి.. ఈ విధంగా తన జ్ఞాపకాలను పంచుకున్నారు.

“నేను వినోద్ ఖన్నాను మొదటిసారి సునిల్ దత్త్ సాబ్ ఆఫీసు లో కలిసాను. ‘రేష్మా ఔర్ షెరా’ అనే సినిమాలో మేమిద్దం మొదట కలసి నటించాం. గర్వంగా నడిచే నడక మంచిని కోరే చిరునవ్వు నిత్య ఆశ జీవి చెదరని ధైర్యం నీకే చెల్లింది మిత్రమా.. నీతో మేకప్ రూమ్ లో గడిపిన క్షణాలు.. కలిసి భోజనం చేసిన రోజులు.. పంచుకున్న భావాలు.. అర్ధం లేని మాటలు.. నిన్ను మర్చిపోలేను నేస్తం. నీవు నా మదిలో ఎప్పటికీ పదిలంగా ఉంటావు” అని గుర్తుచేసుకొన్నారు బిగ్ బి.

అమితాబ్ బచ్చన్ వినోద్ ఖన్నా కలిసి హింది సినిమా హిస్టరి లో కలకాలం గుర్తు౦డిపోయే సినిమాలు చేశారు. ‘హేరా ఫెరి’ ‘పార్వరిష్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ ‘మూకద్దర్ కా సికందర్’ లాంటి గొప్ప చిత్రాలులో కలిసి నటించారు. మనిషి పవిత్రతను గుర్తు చేసుకోవడానికి మరణం ఒకటేనా సమయం అనిపిస్తోంది ఇటువంటి బ్లాగ్స్ చూస్తుంటే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/