Begin typing your search above and press return to search.

64లోనూ అదే యాక్షన్‌, అదే ఫ్యాక్షన్‌

By:  Tupaki Desk   |   31 Aug 2015 4:07 PM GMT
64లోనూ అదే యాక్షన్‌, అదే ఫ్యాక్షన్‌
X
రజనీకాంత్‌ - అమితాబ్‌ బచ్చన్‌ - కమల్ హాసన్ - చిరంజీవి వీళ్లను హాలీవుడ్‌ స్టార్లతో పోల్చవచ్చు. సిల్వస్టర్‌ స్టాలోన్‌ - హారిసన్‌ ఫోర్డ్‌ - ఆర్నాల్డ్‌ స్క్వాజ్‌ నెగ్గర్‌ .. వీళ్లంతా లేటు వయసు (60-70)లోనూ ఇరగదీసేస్తున్నారు. హాలీవుడ్‌ ని ఇప్పటికీ అట్టుడికిస్తున్నారు. ట్యాలెంటుకు వయసుతో పనేంటి అని ప్రూవ్‌ చేస్తున్నారు. స్టాలోన్‌, హారిసన్‌ లాంటి హీరోలు ఇంత లేటు వయసులోనూ ఎక్స్‌ పెండిబుల్స్‌ సిరీస్‌ లో నటిస్తూనే ఉన్నారు. ఆర్నాల్డ్‌ ఇటీవలే ఓ భారీ యాక్షన్‌ చిత్రంలో అదరగొట్టేశాడు. 60లలోనూ ఈ హీరోలు యాక్షన్‌ స్టార్లుగా వెలుగొందుతున్నారు.

అలాంటి స్టార్లు సౌత్‌, నార్త్‌ లో ఎంతమంది ఉన్నారు? అని ఆరాతీస్తే .. ఓ మూడు పేర్లు ప్రముఖంగా చెప్పుకోవాల్సిందే. తమిళంలో అపూర్వ రారంగల్‌ (1977) చిత్రంతో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కెరీర్‌ ప్రారంభించారు. ఆ సినిమా రిలీజై ఇప్పటికి 40 సంవత్సరాలైంది. అతడి వయసు 60పై మాటే. అయినా ఇప్పటికీ కుర్రహీరోలాగా యాక్షన్‌ స్టార్‌ గా కొనసాగుతున్నాడు. త్వరలోనే డాన్‌ గా కాబలిలో దర్శనమిస్తున్నారు. ఉత్తరాదిన అమితాబ్‌ బచ్చన్‌ కురువృద్ధుడే అయినా నటుడిగా ఎనర్జిటిక్‌ గా కొనసాగుతున్నారు. ఇక సౌత్‌ లో కమల్‌ హాసన్‌ ఆల్రెడీ సినిమాలను ఉతికి ఆరేస్తుండగా, 60 టచ్‌ చేసిన మెగాస్టార్‌ చిరంజీవి కూడా 150వ సినిమాకి రెడీ అవుతున్నారు. ఇదో యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌. ఆటోజానీ అనే మాస్‌ టైటిల్‌ ఆకట్టుకుంది. కాబట్టి వీళ్లంతా హాలీవుడ్‌ స్టార్లలా ఏల్తున్నారనే చెప్పాలి. ఇలాంటి ఛాన్స్‌ వేరే హీరోలకు ఉంటుందా?