Begin typing your search above and press return to search.

హ్యాకర్ లకు బిగ్ బీ కౌంటర్!!!

By:  Tupaki Desk   |   31 Aug 2015 8:54 AM GMT
హ్యాకర్ లకు బిగ్ బీ కౌంటర్!!!
X
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కి గురైంది. అశ్లీల వీడియోలు, లింకులు, పోస్టులతో బిగ్ బీ వాల్ ని నింపేశారు హ్యాకర్లు. ఈ విషయాన్ని స్వయంగా తానే ఓ ట్వీట్ ద్వారా చెప్పారు అమితాబ్. తన అకౌంట్ ను హ్యాక్ చేసి... సెక్స్ సైట్లను ఫాలో అవుతున్నట్లుగా పోస్ట్ లు చేశారని వివరించారాయన. ఇలాంటి హ్యాకింగ్ ఈ మధ్య బాగా పెరిగిపోతోంది. చాలామంది సెలబ్రిటీలకు ఈ ఇబ్బంది తప్పడం లేదు.

కానీ మిగతావాళ్ల మాదిరిగా ఊరుకోలేదు అమితాబ్. హ్యాక్ చేసిన వారికి సరైన పంచ్ ఇచ్చారు. ఆయన స్థాయికి తగ్గట్లుగా కౌంటర్ వేశారు అమితాబ్. ఇలా చేసినవారు ఎవరైనా ఓ విషయం తెలుసుకోవాలని.... ఇలాంటివాటితో తనకు అవసరం లేదని తెలుసుకోవాలన్న బిగ్ బీ.. ఇందుకోసం ఇంకెవరినైనా వెతుక్కోవాలని రిటార్ట్ ఇచ్చారు బిగ్ బీ. అమితాబ్ బచ్చన్ ఇచ్చిన సింపుల్ గా, వివరణగా ఉన్నా.. చాలా అంతరార్ధం ఉందన్న విషయం అర్ధమవుతోంది. ఫన్నీగా చెబ్తూ.. పంచ్ లు వేయడంలో.. అమితాబ్ ఆరితేయిపోయినట్లున్నారు కదూ.

ప్రస్తుతం దేశంలో అత్యధిక ఫాలోయర్స్ ఉన్న వ్యక్తి అమితాబ్. అందుకే ఆయన్ని హ్యాకర్లు టార్గెట్ చేశారని భావించచ్చు. సాధారణంగా అవి తమకు కావని చెప్పేసి చేతులు దులుపుకుంటారు సెలబ్రిటీలు. కానీ బిగ్ బీ మాత్రం సంథింగ్ డిఫరెంట్. అందుకే ఇలాంటి ఫన్నీ రిటార్ట్.