Begin typing your search above and press return to search.

ఫ్లాప్ సినిమాకి రీమేక్ ఏంటో?

By:  Tupaki Desk   |   23 July 2016 3:30 PM GMT
ఫ్లాప్ సినిమాకి రీమేక్ ఏంటో?
X
సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ కబాలి రిలీజ్ కి ముందు చాలానే సెన్సేషన్స్ సృష్టించింది. దీంతో ప్రీమియర్ - ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డులన్నీ దాదాపు బ్రేక్ అయిపోయాయి. సినిమాకి టాక్ బాగుంటే రిలీజ్ తర్వాత కూడా ఈ ఎఫెక్ట్ కంటిన్యూ అయేది.

కానీ ఇప్పటికే నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. దీంతో డ్యామేజ్ కంట్రోల్ పై దృష్టి పెట్టారు కబాలి నిర్మాతలు. అందులో భాగంగా పాజిటివ్ ఫీలర్స్ వదులుతున్నారు. ఇందులో భాగంగా కబాలిని హిందీలో రీమేక్ చేస్తున్నారనే టాక్ వదిలారు. బాలీవుడ్ వెర్షన్ లో ఏకంగా బిగ్ బీ అమితాబ్ ఈ రోల్ లో నటిస్తారని అంటున్నారు. ఒరిజినల్ వెర్షన్ లో తమిళ్ నేటివిటీ ఎక్కువగా ఉంటుందని.. దీన్ని హిందీకి అనువుగా మార్చి రీమేక్ చేస్తారని చెబుతున్నారు.

మూవీ హిట్ అయి ఉంటే పరిస్థితి ఇవన్నీ నమ్మట్లుగా ఉంటాయి కానీ.. ఇప్పటికే విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చేసింది. భారీ ఫ్లాపుల ఖాతాలో కూడా వేసేశారు. మరి ఇలాంటి మూవీకి రీమేక్.. అది కూడా అమితాబ్ తో అంటే జనాలు నమ్మేస్తారంటారా?