Begin typing your search above and press return to search.

తొలిసారి సూట్ లో బిగ్ బీ...వైర‌ల్ ఫొటో!

By:  Tupaki Desk   |   13 Dec 2017 4:21 PM GMT
తొలిసారి సూట్ లో బిగ్ బీ...వైర‌ల్ ఫొటో!
X
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. త‌న‌కు - త‌న ఫ్యామిలీకి సంబంధించిన అప్ డేట్స్ ను అమితాబ్ ట్విట్ట‌ర్ లో - ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటారు. సామాజిక‌ - వ‌ర్త‌మాన అంశాల‌పై కూడా బిగ్ బీ సోష‌ల్ మీడియాలో స్పందిస్తారు. నిత్యం త‌న అభిమానుల‌తో ట‌చ్ లో ఉండే బిగ్ బీ తాజాగా త‌న ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ ను వారితో పంచుకున్నారు. మొట్ట‌మొద‌టి సారిగా సూట్ వేసుకొని - త‌న త‌ల్లి తేజీ బ‌చ్చ‌న్ తో దిగిన ఫొటో ను అమితాబ్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతేకాదు - త‌న‌కు ఫ్యాషన్ గా ఉండ‌డం నేర్పించింది త‌న క‌న్న‌త‌ల్లేన‌ని అమితాబ్ అన్నారు. త‌న త‌ల్లితో యంగ్ బిగ్ బీ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది.

తొలిసారి ధ‌రించిన దుస్తులకు మ‌నం ఎంతో ప్రాధాన్యం ఇస్తాం. అలాగే అమితాబ్ తొలిసారి వేసుకున్న సూట్ కు కూడా చాలా ప్రాధాన్యత ఉంద‌ట‌. త‌న త‌ల్లి తేజీ బ‌చ్చ‌న్ మొద‌టిసారిగా సూట్ తొడ‌గ‌డం - టై క‌ట్టుకోవ‌డం నేర్పించింద‌ని అమితాబ్ చెప్పారు. అల‌హాబాద్ లో ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డానికి హాజ‌ర‌య్యేందుకు ఆ సూట్ వేసుకున్నాన‌ని తెలిపారు. త‌ను ఇంత స్టైల్ గా - ఫ్యాష‌న్ గా ఉండ‌డానికి కార‌ణం త‌న త‌ల్లేన‌ని అమితాబ్ తెలిపారు. 'అమ్మ‌ - నేను...1950వ ద‌శ‌కం ప్రారంభంలో అనుకుంటా... నా స్టైల్‌ - ఫ్యాష‌న్‌... అంతా అమ్మ చ‌లువే. అల‌హాబాద్‌ లో ఓ ఈవెంట్ కోసం అమ్మ నన్ను తొలిసారిగా సూట్‌ - టై వేసుకోమన్నప్పటి ఫొటో ఇది. అమ్మ‌తో ఆ మ‌ధుర జ్ఞాప‌కాలు ఎన్న‌టికీ చెరిగిపోవు' అని అమితాబ్ పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.