Begin typing your search above and press return to search.

బాలయ్య రైతులో బిగ్ బీ రోల్ ఇదే

By:  Tupaki Desk   |   23 Oct 2016 11:30 AM GMT
బాలయ్య రైతులో బిగ్ బీ రోల్ ఇదే
X
గౌతమిపుత్ర శాతకర్ణిగా ఈ సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నందమూరి బాలకృష్ణ. చారిత్రాత్మక కథాంశంతో ఆకట్టుకునే విజువల్స్ తో.. ఇప్పటికే బోలెడంత బజ్ క్రియేట్ చేశాడు శాతకర్ణి. తన వందో సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న బాలయ్య.. ఇప్పటికే తన 101పై కూడా ఓ క్లారిటీకి రావడమే కాదు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేయడం విశేషం.

కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కించనున్న రైతు.. బాలయ్య 101వ సినిమా. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారని ఇప్పటికే తెలుసు. సర్కార్ సెట్స్ లో బిగ్ బీని కలిసిన బాలయ్య.. ఓ కీలక పాత్ర చేయాలని కోరడం.. అమితాబ్ అంగీకరించడం జరిగిపోయాయి. అయితే.. రైతులో అమితాబ్ 'భారత రాష్ట్రపతి'గా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ పాత్రకు ఉన్న ప్రాధాన్యం కారణంగా.. ఇండియాలో మరే నటుడూ ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ కారనే ఉద్దేశ్యంతోనే బిగ్ బీ ని అడిగారట.

అమితాబ్ ఎంట్రీ కారణంగా.. ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే రైతు సంచలనం అయిపోయింది. ప్రస్తుతం శాతకర్ణికి సంబంధించిన పనులను పూర్తి చేస్తున్న బాలయ్య.. జనవరిలో ఆ సినిమాలో రిలీజ్ అయ్యాక.. మార్చ్ చివరి నుంచి రైతు షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ఇప్పటికే పూర్తి స్థాయి స్క్రిప్ట్ చేతిలో ఉండడంతో.. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కువగా ఆలస్యం ఉండదని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/