Begin typing your search above and press return to search.

న్యూ బీస్ట్ తో మెగాస్టార్ సూపర్ పోజ్..

By:  Tupaki Desk   |   13 Feb 2016 1:30 PM GMT
న్యూ బీస్ట్ తో మెగాస్టార్ సూపర్ పోజ్..
X
మెగాస్టార్ కొత్త రేంజ్ రోవర్ కొన్నాడు.. కొత్త కార్లు, అందులోనూ లగ్జరీ కార్లంటే సెలబ్రిటీలకు మహా మోజు. ఇలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు కార్లంటే తెగ పిచ్చి. రీసెంట్ గా ఆయన రేంజ్ రోవర్ కొత్త మోడల్ పక్కన నుంచుని ఉన్న ఫోటోను తనే ట్వీట్ చేశారు. ఈ ఫోటోతో ఆయన ఈ బీస్ట్ ను కొనుగోలు చేసేస్తున్నానని ఇన్ డైరెక్టుగా చెప్పారు. ఇప్పుడు కొన్న రేంజ్ రోవర్ తో కలిపి.. మొత్తం బిగ్ బీ దగ్గర ఉన్న కార్ల సంఖ్య మొత్తం 17కి చేరుకుంది.

రీసెంట్ గా అమితాబ్ పుట్టిన రోజున.. బీఎండబ్ల్యూ మిని కూపర్ గిఫ్ట్ ఇచ్చాడు కొడుకు అభిషేక్ బచ్చన్. ఇది కాక పలు లగ్జరీ మోడల్స్ ఆయన దగ్గరున్నాయి. బెంట్లే అర్నాజ్ ఆర్ - బెంట్లే కాంటినెంటల్ జీటీ - లెక్సస్ ఎల్ ఎక్స్ 470 - పోర్ష్ కేమాన్ - రేంజ్ రోవర్ ఎస్యూవీ - రోల్స్ రాయిస్ ఫాంటం - టయోటా ల్యాండ్ క్రూజర్ లు... మెగాస్టార్ కలెక్షన్ లో కొన్ని మోడల్స్. ఇలాంటి లగ్జరీ కార్ల కలెక్షన్ మన టాలీవుడ్ లో కూడా కనిపిస్తుంది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ దగ్గర జాగ్వర్ ఎక్స్ జే ఉంది. రామ్ చరణ్ ఆస్టన్ మార్టిన్ - వాంటేజ్ వీ8 - రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ వాడతాడు. మహేష్ బాబు ఓ రేంజ్ రోవర్ ని రీసెంట్ గా కొనుగోలు చేశాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెర్సిడస్ బెంజ్ జీ 63 ఏఎంజీలో కనపడతారు. బెంజ్ ఆర్ క్లాస్ - ఆడి క్యూ7లను రీసెంట్ గానే కొన్నారు పవన్ మెగాస్టార్ చిరు దగ్గర రోల్స్ రాయిస్ ఫాంటం - టయోటా ల్యాండ్ క్రూజర్ - రేంజ్ రోవర్ ఎవోక్ లు ఉన్నాయి.